Champions Trophy : పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను.. పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసిన వార్తలను ఒకానొక దశలో ఐసిసి కూడా నిజం అనుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అసలు విషయాలన్నీ తెలిసేసరికి సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ దేశస్థుల అసలు రూపం కళ్లకు కనిపించే సజీవ సాక్ష్యం సాక్షాత్కరించింది. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ లో న్యూజిలాండ్ – దక్షిణాఫ్రికా ఆడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం వైపు ప్రయాణం చేస్తోంది. దక్షిణాఫ్రికా ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ అభిమానులు న్యూజిలాండ్ జట్టును ఆకాశానికి ఎత్తడం మొదలుపెట్టారు.
Also Read :అతడు మద్దతుగా నిలిచాడు.. అందువల్లే 42 పరుగులు చేయగలిగాను.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్తాన్ లేకపోవడంతో..
దాదాపు 30 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ దేశంలో ఐసీసీ ఒక మేజర్ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ రంగంలోకి దిగింది. కానీ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడలేకపోయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు 500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసింది. కానీ పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఎలాగూ సొంత దేశంలో.. సొంత జట్టు సత్తా చూపించలేకపోవడంతో పాకిస్తాన్ ప్రజలు న్యూజిలాండ్ జట్టును కీర్తించడం మొదలుపెట్టారు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయపథంలో నడుస్తున్న నేపథ్యంలో..”భారత్ చూస్తున్నావా.. న్యూజిలాండ్ వచ్చేస్తోంది” అంటూ ఓ ఫ్ల కార్డు పై రాసి ప్రదర్శించారు.. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ గా మారింది.. దీనిపై టీమ్ ఇండియా అభిమానులు మండిపడుతున్నారు.” పాకిస్తాన్ జట్టు లాగే.. ఆ దేశ అభిమానులు కూడా ఉంటారు. పైకి విరాట్ అంటే అభిమానమని.. టీమ్ ఇండియా అంటే ఇష్టమని చెబుతుంటారు.. కానీ వారి అసలు రూపం ఇదే. ఇంతకుమించి బలమైన ఆధారం ఇంకేముంటుంది.. భారత్ న్యూజిలాండ్ జట్టను ఆల్రెడీ చూసింది.. ఫైనల్ మ్యాచ్ లోనూ చూస్తుంది.ఇందులో కొత్త ఏముంది. టీమిండియా ఏమైనా న్యూజిలాండ్ జట్టును కొత్తగా చూస్తోందా.. పాపం పాకిస్తాన్ అభిమానులకు ఎవరైనా చెప్పండయ్యా” అంటూ టీమిండియా అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య రెండవ సెమీస్ మ్యాచ్ నేడు.. టీమిండియాతో ఫైనల్లో పోటీపడే జట్టు ఏదో?
Pakistan fans supporting New Zealand. pic.twitter.com/TYsoOyAbxN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025