Graduates MLC Results
Graduates MLC Results : తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన బీజేపీ చివరకు విజయంతో సత్తా చాటింది. ఉమ్మడి ఆదిలాబాద్–కరీంనగర్–మెదర్–నిజాబాబాద్ నియోజకవర్గ పట్టభద్రులు, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. టీచర్స్(Teachers) స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మల్క కొమురయ్య(Malak Komuraiah)ఘన విజయం సాధించారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ మూడు రోజులు సాగింది. ఎట్టకేలకు బుధవారం(మార్చి 5న) ఫలితం తేలింది. ఎలిమినేషన ప్రక్రియ(Elemination Prosess) తర్వాత విజేత ఖరారయ్యారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. మొదటి రౌండ్ నుంచి 11వ రౌండ్ వరకు అంజిరెడ్డి స్థిరమైన ఆధిక్యం కనబర్చారు. 5 వేల ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో రెండోప్రాధాన్యంత ఓట్లను లెక్కించేందుకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. మొత్తం 56 మంది పోటీ చేయగా, 54 మంది ఎలిమినేషన్ తర్వాతనే ఫలితం ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజయం సాధించారు. కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
Also Read: పేరుకే గ్రాడ్యుయేట్లు.. ఓటు వేయడం కూడా రాలేదు.. వైఫల్యంలో ఈసీ పాత్ర కూడా..
కన్నీరు పెట్టిన నరేందర్‌రెడ్డి..
ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్(Congress) అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. విద్యాసంస్థలు నడుపుతూ తొలసారి ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే కళాశాల తరహాలోనే.. తమకు కలిసి వస్తుందని భావించారు. చివరకు ఎన్నికలకు ముందు రోజు భారీగా డబ్బులు కూడా పంచారు. కానీ, చివరకు ఫలితం వ్యతిరేకంగానే వచ్చింది. అయితే డబ్బుల ప్రభావంతో మూడో స్థానంలో ఉంటాడనుకున్న నరేందర్‌రెడ్డి(Narendar Reddy), రెండో స్థానానికి వచ్చారు.
ముందే ఓటమి అంగీకరించిన ప్రసస్న హరికృష్ణ..
ఇక రెండో ప్రనాధాన్యత ఓట్ల లెక్కింపుకు ముందే మూడో స్థానంలో ఉన్న బీఎస్సీ(BSP) అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ(Prasanna Harikrishna) ఓటమిని అంగీకరించారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ.. అగ్రవర్ణాలు ఐక్యంగా పోటీ చేసి.. బీసీ అయిన తనను ఓడించాయని ఆరోపించారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Graduates mlc results bjp candidate anji reddy wins the adilabad karimnagar medar nizababad constituency graduate elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com