Bumrah : తాజాగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో క్రియేటర్లు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నారు. ఇందులో కొందరు నేల విడిచి సాము చేస్తుండగా.. ఇంకొందరేమో మరింత దారుణంగా వ్యవహరిస్తూ.. అరేయ్ ఏంట్రా ఇదీ అని అనేలా చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తే మనిషి ఉన్నతి బాగుంటుంది. అసాధ్యమైన పనులు కూడా అసాధ్యమవుతాయి. అప్పుడు మనిషి జీవితం జీవితం సుఖవంతం అవుతుంది. అలా కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పిచ్చిపిచ్చి పనులకు ఉపయోగిస్తే చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పొరపాటున చూస్తే మాత్రం అది నిజమేమో అనిపిస్తోంది. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ టెక్నాలజీని ఇందుకు ఉపయోగించడం ఏమాత్రం బాగోలేదు.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?
విరాట్ కోహ్లీ చాయ్ వాలా
ఆర్టిఫిషియల్ ద్వారా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అందులో ఒక వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి క్రియేటర్లు క్రికెటర్లతో చిత్ర విచిత్రమైన వీడియో రూపొందించారు. అందులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చాయ్ వాలా గా కనిపిస్తున్నాడు. కళ్ళకు కళ్లద్దాలు.. ఒంటిపై నీలి రంగు చొక్కా.. దానిపై ఆఫ్ బ్లేజర్.. వేసుకొని చాయ్ తయారు చేస్తూ కనిపించాడు. పైగా ఆ వీడియోలో విరాట్ కోహ్లీ నవ్వుతూ కనిపిస్తున్నాడు..ఇక హార్దిక్ పాండ్యా అయితే ఆటోవాలాగా కనిపిస్తున్నాడు. ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూ దర్శనమిస్తున్నాడు. రోహిత్ శర్మ ట్రక్ డ్రైవర్ గా.. తన ట్రక్కును పక్కనపెట్టి వంట చేస్తూ కనిపించాడు. కులదీప్ యాదవ్ పోలీస్ ఆఫీసర్గా.. ఏదో కేసు విచారణలో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. బుమ్రా సైకిల్ మీద క్యాన్లలో ఉన్న పాలను ఇంటింటికి తిరుగుతూ కనిపించాడు. ఇక అదే పాలను విరాట్ కోహ్లీకి పోస్తే అతడు.. చాయ్ చేస్తూ కనిపించాడు. మొత్తానికి ఈ వీడియో అత్యంత సహజ సిద్ధంగా ఉన్నది. కృత్రిమ మేధ సహకారంతో రూపొందించిన ఈ వీడియోలో ప్లేయర్లు ఇలా కనిపించడం చూసే వాళ్లకు కొత్తగా ఉన్నప్పటికీ.. వారి అభిమానులకు మాత్రం రుచించడం లేదు. “మా అభిమాన ఆటగాళ్లు ఇలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారని.. కొత్తగా వారికి కష్టాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదని.. ఆ గొప్ప ఆటగాళ్లను ఇలా రూపొందించడం బాగోలేదని” సోషల్ మీడియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహాలో రూపొందిస్తున్న వీడియోలు పెరిగిపోయాయి. ఈ వీడియోలన్ని ఒక విధంగా ఉంటే.. ఈ వీడియో మాత్రం వాటన్నింటికీ మించి అన్నట్టుగా ఉన్నది.
Also Read : ఈ ముగ్గురికి ఏమైంది.. మరీ సింగిల్ డిజిటా?