Rohit Sharma : ఐపీఎల్ అంటేనే క్యాష్ రిచ్ లీగ్.. ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆటగాళ్ల ఆట తీరుతోనే ముడిపడి ఉంటుంది. ఆటగాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయినా.. అంచనాలను అందుకోలేక పోయినా.. ఆ తదుపరి తీసుకునే చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందువల్లే ఐపిఎల్ లో కొందరు ఆటగాళ్లు మినహా మిగతా వారెవరూ జట్లలో స్థిరంగా లేరు. కొన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ కు ఆటగాళ్లకు గ్యాప్ వచ్చినప్పుడు.. ఆటగాళ్లు ఆయా జట్ల నుంచి బయటికి వెళ్లిపోయారు. ఉదాహరణకు గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ ది. కానీ అతడిని ఈ సీజన్ కి కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం అంటిపెట్టుకోలేదు.. గత సీజన్లో ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ పర్వాలేదని స్థాయిలో ఆడాడు. కానీ అతడిని ఢిల్లీ యాజమాన్యం జట్టులో ఉంచుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు చాలా.. స్థూలంగా చెప్పాలంటే ఐపిఎల్ లాంటి టోర్నీలలో ఆటగాళ్లు ఆడినప్పుడే విలువ ఉంటుంది. ఆడని రోజు జట్టు నుంచి తిరస్కారం ఉంటుంది.
Also Read : ఈ ముగ్గురికి ఏమైంది.. మరీ సింగిల్ డిజిటా?
తీసేసారా?
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ముంబై జట్టు తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ తన స్థాయి లో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. వాస్తవానికి రోహిత్ వైట్ బాల్ ఫార్మాట్లో అద్భుతంగా ఆడతాడు. బలంగా బంతులను కొడతాడు. ఏకంగా పరుగులు తీస్తాడు. సునాయాసంగా ఫోర్లు, సిక్సర్లు బాదుతాడు. అయితే అటువంటి ఆటగాడు ప్రస్తుత సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ముంబై ఆడిన మ్యాచ్లలో ఒక్కటి కూడా తనదైన ఇన్నింగ్స్ అని చెప్పుకునే స్థాయిలో ఆడలేకపోయాడు. దీంతో శుక్రవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు కనిపించలేదు. పైకి అతడికి గాయమైందని చెబుతున్నప్పటికీ.. అంతిమంగా మాత్రం అతడిని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే రోహిత్ శర్మ సుదీర్ఘ కెరియర్లో గాయపడిన సంఘటనలు చాలా తక్కువ. పైగా గాయపడే స్థాయిలో రోహిత్ శర్మ తన శరీరాన్ని కష్టపెట్టుకోడు. అయితే అకస్మాత్తుగా అతడికి గాయం అవ్వడం వల్ల మ్యాచ్ కు దూరంగా ఉంచామని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. అయితే అది నిజం కాదని.. ఫామ్ లో లేకపోవడం వల్లే రోహిత్ శర్మ ను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ” గత సీజన్లో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు. ఈ సీజన్లో అసలు జట్టు నుంచే పక్కన పెట్టారు. అసలు రోహిత్ శర్మ ఏం చేద్దాం అనుకుంటున్నారు.. అతడి కెరియర్ ను ఏం చేద్దాం అనుకుంటున్నారని” రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. కాగా, రోహిత్ శర్మ స్థానంలో రాజా భావా అనే ఆటగాడిని జట్టులోకి తీసుకున్నారు.
Also Read : రేపే ‘ఆదిత్య 369’ రీ రిలీజ్..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!