Bengaluru : ఇవీ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు.. జరుగుతున్న ప్రచారం. కానీ విజేతగా నిలిచే ముందు బెంగళూరుకు మరో షాక్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక పర్యాయాలు బెంగళూరు జట్టు విజేతగా నిలిచే సమయంలో అనూహ్య స్థితిలో ఓటమిపాలైంది. దీంతో గత 17 సంవత్సరాలుగా ఐపిఎల్ కప్ ఆశలను వదిలేసుకుంటూ వస్తోంది. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితికి తావు ఇవ్వకుండా గెలవాలని బెంగళూరు జట్టు భావిస్తున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.. ఎందుకంటే బెంగళూరు జట్టు ఐపిఎల్ కప్ సాధించే ముందు ఎదురవుతున్న పరిణామాలు యాజమాన్యాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Also Read : గేల్, విరాట్ కాదు.. రోమారియో షెఫర్డే బెంగళూరు బీస్ట్..
కీలక బౌలర్ కు గాయం
బెంగళూరు బౌలర్ జోస్ హేజిల్ వుడ్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. తద్వారా ఈ టోర్నీ మొత్తానికే దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జూన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. దక్షిణాఫ్రికా తో జరిగే ఈ మ్యాచ్లో హేజిల్ వుడ్ జట్టుకు అందుబాటులో ఉండాలని యాజమాన్యం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడు తదుపరి బెంగళూరు జట్టు ఆడే మ్యాచ్ లకు అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఈ సీజన్లో బెంగళూరు సాధించిన విజయాలలో హేజిల్ వుడ్ కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన బౌలింగ్ వల్ల బెంగళూరు ఓడిపోయే మ్యాచులలో సైతం విజయాలు సాధించింది. బెంగళూరు జట్టులో యశ్ దయాల్ కీలకమైన బౌలర్ గా ఉన్నాడు. ఇప్పుడు హేజిల్ వుడ్ దూరమైతే.. అతని స్థానంలో ఎవరిని కొత్తగా తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. మరోవైపు కృణాల్ పాండ్యా కూడా బెంగళూరు జట్టుకు కీలక బౌలర్ గా ఉన్నాడు. అతడు కూడా అదరగొడుతున్నాడు. అటు బ్యాట్.. ఇటు బంతితో సత్తా చూపిస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్ ప్లే ఆఫ్ నుంచి తప్పకుండా నేపథ్యంలో.. కీలకమైన ప్లేయర్లు కమిన్స్, హెడ్ కూడా ఆస్ట్రేలియా కే పరిమితమయ్య అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరికి ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ను దృష్టిలో పెట్టుకొని వీరికి ఆస్ట్రేలియా యాజమాన్యం స్వదేశానికే పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గత సీజన్లో ఆస్ట్రేలియా భారత జట్టును ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని అందుకుంది. ఈ సీజన్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించి రెండవసారి టెస్ట్ గద పండుకోవాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది.. అందుకే కీలకమైన ప్లేయర్లను ఐపీఎల్ లో ఆడకుండా ఆస్ట్రేలియాలోని ఉంచుకుంటున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఏ విధంగా ప్రతిఘటిస్తుందో చూడాలి.
Also Read :చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!