Jagadeka veerudu Athiloka Sundari : సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు పెను ప్రభంజనాలను సృష్టిస్తాయి…ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే క్లాసికల్ హిట్స్ గా నిలిచిపోతూ ఉంటాయి. ఇక అలాంటి కోవకు చెందిందే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అందాల నటి శ్రీదేవి (Sridevi) హీరో హీరోయిన్లుగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా… ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. నిజానికి ఈ సినిమా 1990 మే 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కి ముందు ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ (Ashwini Dath) విపరీతమైన భయాందోళనలకు గురయ్యాడట. ఎందుకంటే అప్పట్లోనే ఈ సినిమా కోసం ఆయన రెండు కోట్ల బడ్జెట్ ను కేటాయించి మరి చాలా గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. తను అనుకున్న ఆస్తులన్నింటిని అమ్మి మరీ ఈ సినిమా కోసం డబ్బులను పెట్టడం ఆయనకు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ ఎలాంటిదో చెప్పకనే చెబుతుంది… ఈ సినిమా కథని మొదట అనుకున్నప్పుడు ఇందులో చిరంజీవిని హీరోగా తీసుకోవాలని అశ్విని దత్ అనుకున్నారట. ఇక హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనుకున్న సందర్భంలో శ్రీదేవి అయితే ఈ సినిమాలో బాగుంటుందని ఆమెను సంప్రదించారట. అయితే శ్రీదేవి మాత్రం చిరంజీవికి ఎంతటి గుర్తింపు అయితే ఉందో తనకి కూడా దేవకన్యలా అంతటి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ రాస్తేనే తను ఈ సినిమాలో చేస్తానని చెప్పిందట. దానికి దర్శకుడు ప్రొడ్యూసర్ ఓకే చెప్పడంతో ఆమె ఈ సినిమాలో సెట్ అయింది. ఇక అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా కోసం 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే శ్రీదేవి సైతం 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక రెండు కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే బీభత్సమైన తుఫాను వర్షం వరదలు అయితే వచ్చాయట. ఇక వీటన్నింటినీ తట్టుకొని ఈ సినిమా ఆడుతుందా అసలు థియేటర్ కి ప్రింట్స్ ఎలా పంపించాలి. ఒకవేళ థియేటర్లకు ప్రింట్ పంపించిన ఈ తుఫాన్ లో సినిమా చూడడానికి ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడా? అనే ఒక డైలమాలో ప్రొడ్యూసర్ అశ్విని దత్ అయితే ఉన్నారట.
Also Read : దుమ్ములేపిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
మరి ఈ తుఫాన్ తాకిడి నుంచి తను ఎలా బయటపడాలి అనే విషయంలో ఆయన చాలా వరకు సుతమతమవుతున్న సందర్భంలో అశ్వినీదత్, రాఘవేంద్రరావు, చిరంజీవి ముగ్గురు కలిసి అప్పటికే పాలిటిక్స్ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ని కలిసి అతని సజెషన్స్ అయితే తీసుకున్నారట. మొత్తానికైతే ఆయన మీరు ఎక్కడ వెనక్కి తగ్గకండి సినిమాని అనుకున్న టైం కి అనుకున్నట్టుగా రిలీజ్ చేయండి. మీకు అంత మంచే జరుగుతుందని చెప్పారట.
అయినప్పటికి అశ్విని దత్ కి ఈ సినిమా ఎలా ఉంటుందో ఆడుతుందో పోతుందో ఒకవేళ సినిమా పోతే తన పరిస్థితి ఏంటి ఉన్నదంతా అమ్మి సినిమాకి పెట్టాను అంటూ ఆయన తనలో తానే తీవ్రమైన మనస్థాపానికి గురయ్యారట. అది తెలుసుకున్న తన తండ్రి అశ్విని దత్ ను మామూలుగా స్థాయికి తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నం కూడా చేశారట. మొత్తానికైతే ఈ సినిమా 1990 మే 9 వ తేదీన రిలీజ్ అయితే అయింది. ఇక వరదల తాకిడి ఏ రేంజ్ లో ఉందంటే సినిమా థియేటర్లోకి కూడా వరదలు వచ్చాయట.
కానీ సినిమాకి హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లో నిలుచొని మరి ఈ సినిమాని చూసి సూపర్ సక్సెస్ ని చేశారు అంటే మామూలు విషయం కాదు… ఒక సినిమాను హానెస్ట్ గా నమ్మి దానిమీద డబ్బులు పెట్టి చాలా బాగా తెరకెక్కించినట్టయితే సినిమా అనేది ఎప్పటికీ మనల్ని మోసం చేయదు అని చెప్పడానికి ఈ సినిమాని ప్రొడ్యూసర్ అశ్విని దత్ ను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…ఇక అప్పట్లోనే ఈ సినిమా 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 15 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక రీసెంట్ గా రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా తన సత్తాను చాటుతూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Read : చిరంజీవి జగదేక వీరుడు సినిమాను రీమేక్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక హీరో అతనే..మనసులో మాట చెప్పిన మెగాస్టార్…