Shreyas Iyer ODI captain: టీమిండియాలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా టెస్ట్ ఫార్మేట్లో దారుణమైన ఫలితాలను చూస్తోంది. అందువల్లే జట్టులో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ తన తీరు మార్చుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూచనలు చేస్తున్నారు.
జాతీయ మీడియాలో టీమిండియా క్రికెట్ కు సంబంధించి ఒక వార్త తెగ సర్కులేట్ అవుతోంది. టీమిండియా వన్డే విభాగానికి కొత్త సారధి వస్తాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా కు వన్డే ఫార్మాట్లో గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా తొలి ద్వైపాక్షిక సిరీస్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడింది. అయితే ఈ సిరీస్ టీమ్ ఇండియా దక్కించుకోలేకపోయింది. దీనికి తోడు గిల్నాయకత్వం సరిగా లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో గిల్ స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో మెడ గాయంతో తప్పుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. అతని ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వన్డే సిరీస్ గెలిచింది.
ఇక ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో వరుసగా విఫలమయ్యాడు. వచ్చిన అవకాశాలను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అతడిని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించారు. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా అతడిని సారధిగా తప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ ముందుకు నడిపిస్తాడని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పొమ్మన లేక పొగ పెట్టడంతో రోహిత్ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అదే దారి అనుసరించాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గిల్ టెస్ట్ పగ్గాలు అందుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ సమం చేసింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ లో తొలి టెస్ట్ లో మధ్యలోనే వెళ్లిపోయాడు. రిషబ్ పంత్ తదుపరి తంతు నిర్వహించినప్పటికీ టీమ్ ఇండియాకు ఉపయోగం లేకుండా పోయింది.
గిల్ ఇటీవలి దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్ లో సరిగా ఆడలేదు. అతడికి మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్సీ అప్పగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మరికొద్ది రోజుల్లో జరిగే టి20 వరల్డ్ కప్ కు అతడిని మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. అతడి విఫల ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో.. వన్డే సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పించాలని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంత వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.