Woman birthday goes viral: పుట్టినరోజు.. పెళ్లిరోజు.. ఇతర వేడుకలు.. ఇలా సందర్భం ఏదైనా సరే కేక్ కట్ చేయడం చాలా మందికి అలవాటు. పైగా ఇటీవల కాలంలో ఈ తరహా వేడుకలను భారీగా సెలబ్రేట్ చేసుకోవడం పెరిగిపోయింది. రకరకాల కేకులను తయారు చేయించుకుని.. బంధువుల సమక్షంలో వాటిని కట్ చేసి. అందరికీ పంచడం అలవాటుగా మారింది. అయితే ఓ యువతి పుట్టినరోజు సందర్భంగా కట్ చేసిన కేకు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం నక్షత్ర అనే యువతి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్నేహితుడు జొమాటోలో కేకు ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చేసే అబ్బాయికి అర్థం కావాలనే ఉద్దేశంతో.. సజెషన్ కాలం లో ” leave at security” (సెక్యూరిటీ విభాగం వద్ద ఇచ్చేయండి అని అర్థం) అని రాశాడు. అయితే ఈ కేక్ షాప్ యజమాని దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే టూ యు నక్షత్ర అని రాయకుండా.. లీవ్ ఇట్ సెక్యూరిటీ అని కేకు మీద రాశాడు.
నక్షత్ర ఎంతో ఉత్సాహంతో బాక్స్ ఓపెన్ చేసింది. కేకు మీద లీవ్ ఇట్ సెక్యూరిటీ అని రాసి ఉండడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది..కేకు మీద అలా రాసి ఉండడంతో ఆమె స్నేహితులు పగలబడి నవ్వారు. అంతేకాదు ఆమె ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీసి ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇప్పటికే లక్షలలో వ్యూస్ సంపాదించుకొని సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్లు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. ఓ వ్యక్తి తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా.. కేకు మీద పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అని రాయమంటే.. అదేవిధంగా రాశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని కాకుండా రాయమంటే అనే పదాన్ని కూడా రాశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరో వైపు కేకు మీద లీవ్ ఇట్ సెక్యూరిటీ అనే పదం ఉండటంతో కేకు కట్ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో నక్షత్ర ఉండిపోయింది. చాలా సేపు తర్వాత ఆమె ఆ కేక్ కట్ చేసింది.
View this post on Instagram