https://oktelugu.com/

Australia vs India టీమిండియా కు మూల స్తంభాలన్నారు.. ఇలా ఆడితే ఏం గెలుస్తుంది?

పెర్త్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా జట్టు సమూలంగా మారింది. అడిలైడ్ టెస్ట్ లో గట్టిగానే పట్టు బిగించింది. మొత్తంగా చూస్తే టీమిండియా మరోసారి తనకు పింక్ బాల్ అచ్చి రాదని నిరూపించే పనిలో పడింది. అద్భుతం జరిగితే తప్ప అడిలైడ్ లో ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2024 / 10:28 PM IST
    Follow us on

    Australia vs India  అడిలైడ్ టెస్టులో టీమిండియా మూల స్తంభాలుగా పేరుపొందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ (6) పరుగులు మాత్రమే చేసి.. అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియాకు పట్టు సాధించే అవకాశం కల్పించారు. వీరిద్దరూ అవుట్ కావడంతో శనివారం రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయింది. 24 ఓవర్లలో 128 రన్స్ చేసింది. ప్రస్తుతం పంత్ (28), నితీష్ కుమార్ రెడ్డి (15) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్, కమిన్స్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

    హెడ్ వీర విహారం

    ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 337 స్కోర్ చేసింది అంటే దానికి ప్రధాన కారణం హెడ్. ఆ స్కోర్ వల్ల టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా 157 రన్స్ లీడ్ దక్కించుకుంది. హెడ్ (140) మైదానంలో వీర విహారం సృష్టించాడు. లబూ షేన్(64) అదరగొట్టాడు. సిరాజ్, బుమ్రా చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ చెరో క్రికెట్ పడగొట్టారు. టీం ఇండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు ఆటలో టీమిండియా అంతగా ఆకట్టుకోలేదు. మూడు సెషన్ల పాటు ఆట జరిగితే.. ఒక్కదాంట్లో కూడా పై చేయి సాధించలేదు. ఇక మూడో రోజు ఆటలో రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే ధాటిగా ఆడాల్సి ఉంటుంది. వారిద్దరూ నిలబడితే తప్ప టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు..

    వారేవా బుమ్రా

    బుమ్రా.. రెండవ రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మెక్ స్వీని(39), స్మిత్ (2) ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో లబు షేన్, హెడ్ 55 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ జోడిని నితీష్ కుమార్ రెడ్డి విజయవంతంగా విడగొట్టాడు. లబు షేన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. మార్ష్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ… హెడ్ వీర విహారం చేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఫోర్ ల మీద ఫోర్లు కొట్టాడు. 111 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ ని సిరాజ్ అవుట్ చేశాడు. శతకం కొట్టిన తర్వాత హెడ్ మరింత ధాటిగా ఆడాడు. అయితే అతడిని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది.

    అత్యంత చెత్తగా..

    157 పరుగుల వెనుకబాటుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. ఏ దశలోనూ దూకుడుగా ఆడలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు పన్నిన ఉచ్చులో రాహుల్ (7) చిక్కుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా వికెట్ల పతనం వరుసగా కొనసాగింది. రోహిత్ శర్మ (6) అత్యంత చెత్త ఆటను ప్రదర్శించాడు. విరాట్ కోహ్లీ దారుణంగా ఆడాడు. వీరిద్దరూ అవుట్ కావడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నది. యశస్వి జైస్వాల్, గిల్ కూడా పెవిలియన్ చేరుకోవడంతో టీమిండియా మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది. కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను మరోసారి నిరూపించుకున్నాడు. రోహిత్ అయితే దారుణంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే పంత్, నితీష్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే టీమిండియాకు మూల స్తంభాలుగా ఉన్న రోహిత్, విరాట్ నిలబడి ఉంటే జట్టుకు ఈ దుస్థితి తలెత్తేది కాదు.