Homeఅంతర్జాతీయంRussia China betrayal of Iran: కష్టకాలంలో ఇరాన్ కు నమ్మకద్రోహం చేసిన రష్యా, చైనా

Russia China betrayal of Iran: కష్టకాలంలో ఇరాన్ కు నమ్మకద్రోహం చేసిన రష్యా, చైనా

Russia China betrayal of Iran: మిడిల్‌ ఈస్ట్‌లో అగ్రరాజ్యం అమెరికా పెట్టిన చిచ్చుతో గల్ఫ్‌ దేశాలు మండిపోతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. ఇరాన్‌ ఇప్పుడు ఒంటరిగానే అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ సమయంలో ఇస్లామిక్, అణుశక్తి కలిగిన ఏకైక దేశం పాకిస్తాన్‌ దూరంగా ఉంది. ఇక మిత్ర దేశాలు అయిన రష్యా, చైనా కూడా యుద్ధాన్ని ఖండించి మాటలు చెప్పి మమ అనిపించాయి. హెజ్‌బొల్లా, హౌతీలు మాత్రమే ఇరాన్‌కు అండగా ఉంటున్నారు. చైనా, రష్యా సైనిక లేదా ఆర్థికసాయం చేస్తాయని అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది ఇరాన్‌తో మైత్రి యొక్క వ్యూహాత్మక పరిమితులను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.

రష్యా స్పందన పరిమితం..
ఇరాన్‌తో 20 సంవత్సరాల ద్వైపాక్షిక ఒప్పందం ఉన్న రష్యా, దాడులను ఖండించింది. పుతిన్‌ టెహ్రాన్‌ నేతలతో సంప్రదించారు. సైనిక సహాయం లేదా ఆయుధ సరఫరా వంటివి ప్రకటించలేదు, ఇది వెనెజువెలా మదురో అపహరణ (జనవరి 2026), సిరియా అసద్‌ పతనం (డిసెంబర్‌ 2024) సందర్భాల్లో కనిపించిన వైఫల్యాన్ని పునరావృతం చేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధ ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు మాస్కోను వెనుక్కి నెట్టాయి, మిత్రులకు హామీలు ఇవ్వలేకపోతోంది.

ఖండనతో సరిపెట్టిన చైనా..
ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆధారపడే చైనా, రక్షణ–వ్యూహాత్మక ఒప్పందాలను కలిగి ఉన్నప్పటికీ, ఖమేనీ హత్యకు ఖండనతోనే సరిపెట్టింది. ఇM–302 క్షిపణుల విక్రయ ఆరోపణలను ఖండించి, ట్రంప్‌ ఫిబ్రవరి చివరి బీజింగ్‌ సందర్శన ఆందోళనతో జాగ్రత్తలు పాటిస్తోంది. హోర్ముజ్‌ జలసంధిలో రష్యాతో నౌకా అభ్యాసాలు జరిగినా, పూర్తి అండ లేకపోవడం గమనార్హం.

Also Read: ఇరాన్‌ అమెరికా యుద్ధం.. భారత్‌ నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలు ఇవే!

ఖమేనీ మరణం తర్వాత..
అమెరికా, ఇజ్రాయెల్‌ ఉమ్మడి ఆపరేషన్‌లో ఖమేనీ మరణించడంతో ఇరాన్‌లో అధికార మార్పు ప్రక్రియ మొదలైంది. రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీరెజా అరాఫీ, అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, న్యాయమూర్తి ఘోలం హొస్సెన్‌–ఎజెయీ కలిసి పాలన చేస్తున్నారు. ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ (88 మంది మత పండితులు) కొత్త లీడర్‌ను ఎంపిక చేస్తుంది, మోజ్తబా ఖమేనీ ప్రబల అభ్యర్థిగా కనిపిస్తున్నాడు.

ఈ మౌనం ఇరాన్‌ను ఒంటరిగా నిలబెట్టి, గ్లోబల్‌ కూటములను మలుపు తిప్పవచ్చు. రష్యా–చైనాతో మైత్రి భరోసా లేనట్టు సంకేతాలు ఇతర దేశాల్లో అపార్థాలు కలిగిస్తాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరిగి, అమెరికా ప్రభావం బలపడే అవకాశం ఉంది. ఇరాన్‌ ప్రతీకార చర్యలు, కొత్త లీడర్‌ ఎంపిక త్వరలో మరిన్ని మలుపులు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version