https://oktelugu.com/

Australia vs India : టీమిండియా అంటే చాలు.. “హెడ్” ఏక్ లా తయారవుతాడు..

ఆస్ట్రేలియా - భారత్ మధ్య ఎన్నో మ్యాచ్ లు జరిగాయి. ఇకపై జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది ప్లేయర్లు ఈ రెండు జట్ల నుంచి ఉద్భవించారు. తమ జట్ల కోసం ఆడారు. అయితే భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో.. కంగారూలదే పై చేయి. టి20 ఫార్మాట్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2024 / 10:24 PM IST
    Follow us on

    Australia vs India : భారత్ తో మ్యాచ్ అంటే చాలు ఆస్ట్రేలియా సమష్టి ప్రదర్శన చేస్తుంది. అయితే మెక్ గ్రాత్, షేన్ వార్న్, బ్రెట్ లీ, హెడెన్, గిల్ క్రిస్ట్, పాంటింగ్, డామియన్ మార్టిన్ వంటి వాళ్ళు తమలో ఉన్న ప్రతిభను మరింత అత్యుత్తమంగా ప్రదర్శించేవారు. అందువల్లే వాళ్ళు టీమ్ ఇండియాకు కొరకరాన్ని కొయ్యలయ్యారు. ఆ తరం ముగిసిన తర్వాత.. ఇప్పటి తరం భారత్ కు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. గుర్తుంచుకునే ఆటగాళ్లు ఈ జాబితాలో లేరు. అయితే లిస్టులో ఇప్పుడు ట్రావిస్ హెడ్ చేరినట్టు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు టీమ్ ఇండియాకు ఇతడు రెండు ఐసిసి ట్రోఫీలను దూరం చేశాడు. గెలుపు ముంగిట భారత జట్టును బొక్కా బోర్లా పడేలా చేశాడు. ఇందులో 2023 ఐసిసి వన్డే వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉన్నాయి. మన దేశం వేదికగా గత ఏడాది అహ్మదాబాద్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగినప్పుడు.. హెడ్ 137 రన్స్ చేసి.. భారత జట్టు ఓటమికి కారణమయ్యాడు. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ ను దూరం చేశాడు. స్వదేశంలో రోహిత్ సేనకు కన్నీటిని మిగిల్చాడు. ఇక అదే ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరగగా.. అప్పుడు కూడా భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పుడు కూడా హెడ్ 163 పరుగులు చేశాడు.. 174 బంతులు ఎదుర్కొన్న అతడు 25 ఫోర్లు, ఆరు సిక్సర్లతో మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఓడిపోవలసి వచ్చింది.

    ఇప్పుడు కూడా

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పెర్త్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో 295 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇబ్బంది పడుతోంది. దీనంతటికీ కారణం హెడ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో అతడు సెంచరీ చేశాడు. 111 బంతులు ఎదుర్కొన్న అతడు శతకం కొట్టాడు. డే అండ్ నైట్ టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో సెంచరీలు చేసిన అతడు.. ఇప్పుడు అడిలైడ్ టెస్ట్ లోనూ సెంచరీ చేశాడు. 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 140 రన్స్ చేశాడు. సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. హెడ్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకుండా ఉంటే ఆస్ట్రేలియా కు లీడ్ వచ్చేది కాదు. లబూ షేన్(64) మినహా మిగతా వారంతా తేలిపోయారు. ఈ దశలో హెడ్ నిలబడ్డాడు. ఆస్ట్రేలియాను అడిలైడ్ లో నిలబెట్టాడు.. హెడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా ఆటగాళ్ల ముఖంలో విపరీతమైన నిరాశ కనిపించింది. అతడు అవుట్ అయిన తర్వాతే టీమిండి ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. సిరాజ్ అయితే ఏకంగా ఎగిరి గంతేశాడు. అతడి బౌలింగ్లో హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సంతోషాన్ని తట్టుకోలేక వెళ్ళిపో అన్నట్టుగా సిరాజ్ గట్టిగా అరిచాడు.