spot_img
Homeక్రీడలుAnushka Sharma: నా భర్త విరాట్ అంతగా ఆడడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన...

Anushka Sharma: నా భర్త విరాట్ అంతగా ఆడడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన అనుష్క.. వైరల్

Anushka Sharma: విరాట్ కోహ్లీ తినే తిండి గురించి.. చేసే వ్యాయామం గురించి మీడియాలో అనేక రకాలుగా కథనాలు వచ్చాయి. చివరికి అతడు ఏం తాగుతాడో కూడా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. కానీ విరాట్ అసలు ఏం చేస్తాడు? ఇలా ఉంటాడు? ఎలాంటి తిండి తింటాడు? ఎటువంటి కసరత్తులు చేస్తాడు? మానసిక ప్రశాంతత కోసం ఎటువంటి విధానాలు అవలంబిస్తాడు? వంటి విషయాలపై ఏ మీడియా కూడా కథనాలను ప్రసారం చేయలేదు. ప్రచురించనూ లేదు. కానీ ఈ విషయాలను విరాట్ సతీమణి అనుష్క శర్మ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

అనుష్క శర్మ ఏమని చెప్పిందంటే..

“విరాట్ దేహదారుడ్యానికి ప్రాధాన్యమిస్తాడు.. ఫిట్ నెస్ కు అతడు విపరీతమైన శ్రద్ధ చూపుతాడు. ఖచ్చితమైన సమయానికి నిద్రలేస్తాడు. కార్డియో చేస్తాడు. ఒక్కోసారి హిట్ ట్రైనింగ్ కూడా చేస్తాడు. అనంతరం నాతో చాలాసేపు క్రికెట్ ఆడతాడు. పొరపాటున కూడా చక్కెర తినడు. జంక్ ఫుడ్ ముట్టుకోడు. అతడికి గతంలో బట్టర్ చికెన్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు దానిని పూర్తిగా మానేసుకున్నాడు. దానిని తినక పది సంవత్సరాలు గడిచిపోయింది. మానసిక ఒత్తిడిని దరిచేరనీయడు. నిర్ణీత సమయానికి పడుకుంటాడు. పిల్లలతో ఆడుకుంటాడు. ఆ తర్వాత కసరత్తులు కూడా అదే స్థాయిలో చేస్తాడు. వీటి విషయంలో ఏమాత్రం రాజీపడడు. తన సామర్థ్యాన్ని పటిష్టంగా ఉంచుకోవడంలో విరాట్ విపరీతమైన శ్రద్ధ చూపుతాడు. దీనికోసం తనకి ఇష్టమైన వాటిని వదులుకున్నాడు. విశ్రాంతి కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు కాబట్టే విరాట్ ఈ స్థాయిలో సత్తా చాట గలుగుతున్నాడని” అనుష్క శర్మ వ్యాఖ్యానించింది..

తాగే నీరు కూడా..

విరాట్ తను తాగే నీరు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. అందులో స్వచ్ఛమైన లవణాలు ఉంటాయి. వాటిని తాగిన వెంటనే దేహం సత్తువను సంపాదించుకుంటుంది. అది రోజు మొత్తం దేహంలో లవణాలు కోల్పోకుండా చేస్తుంది. అందువల్లే విరాట్ గంటల తరబడి క్రీజ్ లో ఉంటాడు. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. ఫిట్ నెస్ కు అంత ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టే.. ఇన్ని సంవత్సరాలైనా విరాట్ ఇంకా దూకుడుగానే ఆడుతున్నాడు. ఇటీవల పెర్త్ టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు. దాదాపు 16 నెలల విరామం తర్వాత అతడు శతకం చేశాడు. ఇక రెండో టెస్టు కోసం మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా విరాట్ సెంచరీ చేసి తన పూర్వపు ఫామ్ ను అంది పుచ్చుకోవాలని అతడి అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES
spot_img

Most Popular