Pushpa 2: సుకుమార్-అల్లు అర్జున్ మూడేళ్లు పుష్ప 2 కోసం కష్టపడ్డారు. పుష్ప 2021లో విడుదలైంది. ఆ చిత్రం అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ . ఐదు భాషల్లో విడుదల చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ మూవీ రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అనూహ్య పరిణామం. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 చిత్రాన్ని మరింత భారీగా తెరకెక్కించాలని సుకుమార్ భావించారు.
నిర్మాతలు కూడా సుకుమార్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఫైనల్ గా డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్స్ లో విడుదల చేశారు. ఫస్ట్ షో నుండే పుష్ప 2 చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ దక్కడం విశేషం. సాంగ్స్, ఫైట్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, అల్లు అర్జున్ నటన, రష్మిక మందాన నటన, గ్లామర్.. ప్రతి విషయంలో పుష్ప 2 టాప్ గా ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ పై సుకుమార్ తెరకెక్కించిన ఎలివేషన్ సీన్స్ కిక్ ఇస్తున్నాయట.
యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన బలం అంటున్నారు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలు, ఫైట్ నభూతో నభవిష్యతి అట. అల్లు అర్జున్ ప్రాణం పెట్టేశాడని అంటున్నారు. రష్మిక మందాన రోల్ కూడా కీలకంగా ఉందట. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ మెప్పించాయని సినిమా చూసిన ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.
పీలింగ్స్, సూసేకి, కిస్సిక్ సాంగ్స్ థియేటర్స్ లో ఆడియన్స్ ని ఊపేస్తున్నాయట. ముఖ్యంగా రెండు మాస్ సాంగ్స్ హై ఇచ్చాయట. కథలో వచ్చే ట్విస్ట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బాగున్నాయట. సినిమా అంతా బాగుందట. కాకపోతే నిడివి ఎక్కువ కావడం, ఫహద్ ఫాజిల్ రోల్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఒకింత నిరాశ పరిచే అంశాలు అంటున్నారు. మాస్ ఆడియన్స్ ఆద్యంతం ఎంజాయ్ చేస్తారట.
Web Title: What was the public response to pushpa 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com