spot_img
Homeక్రీడలుBareddy Anusha Cricketer: కూలీ నుంచి టీమిండియా వరకు.. అదరగొట్టిన తెలుగమ్మాయి

Bareddy Anusha Cricketer: కూలీ నుంచి టీమిండియా వరకు.. అదరగొట్టిన తెలుగమ్మాయి

Bareddy Anusha Cricketer: ఆమెది సాధారణ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా ఒకప్పుడు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి వారి కుటుంబానికి అండగా నిలబడింది. అదే అమ్మాయి ఈ రోజు జాతీయస్థాయి మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడి. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.

ఆల్‌రౌండర్‌గా రాణింపు..
అనూష ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్‌ అయిన అనూష తన ప్రతిభతో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ జట్టులో స్థానం పొందింది. బుధవారం ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అనూషను ఎంపిక చేశారు. జాతీయ క్రికెట్‌ టోర్నీలో అనూష అద్భుత ప్రతిభ కనబర్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అనూష ఇంతకుముందే హాంగ్‌కాంగ్‌ లో జరిగిన అండర్‌ 19 టోర్నీలో పాల్గొని కనబరిచింది.

గ్రామీణ క్రీడల్లో మొదటిసారి..
అనంతపురం నగరంలోని ఆర్డిటి సమస్త వారు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే గ్రామీణ స్థాయి క్రికెట్‌ పోటీలలో మొదటిసారిగా అనూష పాల్గొంది. అక్కడ కనబరిచిన ప్రతిభ వల్ల ఆమెను ఆర్టీటీసంస్థవారు 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలోకి తీసుకున్నారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదిగి టీంఇండియాకు సెలక్ట్‌ అయింది.

మహిళా క్రికెటర్లు వెలుగులోకి రావడం అరుదు..
మహిళా క్రికెటర్లు వెలుగులోకి రావడం అరుదు.. అదీ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది టీమిండియాకు ఆడారు. ఈ క్రమంలో అనూష మట్టిలో మాణిక్యంలా వెలుగులోకి వచ్చింది. భారత దేశానికి ఆడే అవకాశం రావడం గర్వంగా ఉందని అనూష పేర్కొంటోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper