https://oktelugu.com/

Ashes Series 2023 : ఇంగ్లాండ్ మళ్లీ మొదలెట్టింది.. ‘బజ్ బాల్ ‘తో ఆస్ట్రేలియాను చావగొట్టింది

రివర్స్ స్వీప్ సిక్సులు మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే రూట్ తన కెరీర్లోనే 30వ టెస్టు శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం భారీ పరుగుల లక్ష్యాన్ని చేదించే దిశగా ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. వార్నర్ (8), ఖవాజా (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Written By:
  • BS
  • , Updated On : June 17, 2023 10:16 am
    Follow us on

    Ashes Series 2023 : ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు నుంచే దూకుడుతో కూడిన ఆటను కొనసాగించింది. గత కొన్నాళ్లుగా ఇంగ్లాండ్ జట్టు అమలు చేస్తున్న బజ్ బాల్ వ్యూహాన్ని యాషెస్ సిరీస్ లోను అమలు చేస్తోంది. తొలిరోజు ఆటలోనే ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేసింది అంటే ఎంత వేగంగా బ్యాటింగ్ చేసిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
    ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది.
    ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా బర్మింగ్ హోమ్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో తొలిరోజే సుమారు 400 పరుగులు చేసి డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలోనే జో రూట్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. ఇంగ్లాండ్ జట్టు గత కొన్నాళ్లుగా అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహాన్ని ఈ సిరీస్ లోనూ అమలు చేసే ప్రక్రియలో భాగంగానే తొలి రోజు వేగంగా బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.
    వన్డే తరహాలో బ్యాటింగ్ ఇంగ్లీష్ బ్యాటర్లు..
    ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ బర్మింగ్ హోమ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. తొలి టెస్ట్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. జో రూట్ అద్భుత శతకంతో అదరగొట్టగా ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. 150 బంతులు ఆడిన రూట్ 7ఫోర్లు, నాలుగు సిక్సులతో 118 పరుగులు చేశాడు. అలాగే, క్రాలీ 73 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 61 పరుగులు చేయగా, బ్రూక్ (32), పోప్ (31), బెయిర్ స్టో 12 ఫోర్ల సహాయంతో 78 బంతుల్లో 78 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడింది. ఆరంభం నుంచే బజ్ బాల్ ఆటను ఆస్ట్రేలియా జట్టుకు రుచి చూపించింది ఇంగ్లాండ్ జట్టు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైన తరువాత ఆస్ట్రేలియా జట్టు తరుపున తొలి ఓవర్ ను కమిన్స్ బౌలింగ్ వేసి ఎటాక్ ను ప్రారంభించాడు. తొలి బంతిని క్రాలీ మెరుపు షాట్ తో బౌండరీకి తరలించాడు. అక్కడి నుంచే ఇంగ్లాండ్ జట్టు దూకుడును ప్రదర్శించింది.
    ఓవర్ కు ఐదు చప్పున పరుగులు..
    ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఓవర్ కు అయిదు చొప్పున పరుగులు వచ్చాయి. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు 176 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. అయితే, బ్రూక్, బెయిర్ స్టో అద్భుతమైన ఆట తీరును కనబరచడంతో భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ జట్టు పయనించింది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న బెయిర్ స్టో ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. జో రూట్  తో కలిసి పోటాపోటీగా ఆడి మెరుగైన స్కోరు సాధించేలా చేశాడు. బెయిర్ స్టో అవుట్ అయినప్పటికీ జో రూట్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మెరుపు వేగంతో పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో జో రూట్ కొట్టిన రెండు రివర్స్ స్వీప్ సిక్సులు మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే రూట్ తన కెరీర్లోనే 30వ టెస్టు శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం భారీ పరుగుల లక్ష్యాన్ని చేదించే దిశగా ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. వార్నర్ (8), ఖవాజా (4) పరుగులతో క్రీజులో ఉన్నారు.