Virat Kohli: విరాట్ కోహ్లీ.. ప్రస్తుత సమకాలీన క్రికెట్లో.. ఏ ఫార్మాట్లో పోల్చుకున్నా అద్భుతమైన క్రీడాకారుడు. మణికట్టు, ఫోర్ లెగ్, బ్యాక్ లెగ్, స్వీప్.. ఇలా అన్ని రకాల షాట్లు ఆడగలడు. జట్టును విజయతీరాలకు చేర్చ గలడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపించిన మ్యాచులు ఎన్నో. అలాంటి కోహ్లీ నేడు ఫామ్ లేమీ తో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ ఆడినా రెండు పదుల స్కోర్ కే అవుట్ అవుతున్నాడు. అతని ఆట చూసి ఆడుతోంది కోహ్లీనేనా అని అభిమానులు కలత చెందుతున్నారు.
నిరాశ పరుస్తోంది
కోహ్లీ సూపర్ బ్యాట్స్మెన్. ఏ ఫార్మాట్ లో అయినా బౌలర్లను చీల్చి చెండాడి పరుగులు సాధించే యంత్రం అతడు. కానీ ఈ మధ్య అతడి బ్యాటింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుండడంతో క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. క్రీడా విశ్లేషకులు నుంచి మాజీ క్రికెటర్ల వరకు అతడి పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. స్టార్ బ్యాట్స్ మెన్ అయినప్పటికీ ఫామ్ లో లేకపోతే జట్టులో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారి విమర్శలకు తగ్గట్టుగానే కోహ్లీ ఆట తీరు ఉండడంతో మేనేజ్ మెంట్ కలవరపడుతున్నది. టీ – 20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీకి చోటు కష్టమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కరేబియన్ టూర్ లో జరిగే వన్డే, టీ 20 సిరీస్ జాబితాలో కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం. అయితే కోహ్లీనే విశ్రాంతి కోరాడని బీసీసీఐ చెబుతోంది.
Also Read: Prabhas Project K: ‘ప్రాజెక్ట్ కే’లో మరో హీరోయిన్.. ప్రభాస్ కెరీర్ లోనే ఇది స్పెషల్
నేడే చివరి అవకాశం
ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న ఇండియా మెరుగ్గా రాణిస్తోంది. ఇప్పటికే టి20 కప్ నెగ్గిన ఇండియా.. వన్డే సిరీస్ పై కన్ను వేసింది. మొదటి మ్యాచ్ గెలిచినా, రెండో మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. దీంతో సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ ఈరోజు(ఆదివారం) జరగనుంది. ప్రస్తుతం ఈ మ్యాచ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. మరిముఖ్యంగా విరాట్ పైనే అందరి దృష్టి ఉంది. వాస్తవానికి ఫేల్వమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ నవంబర్ 23, 2019లో బంగ్లాదేశ్ పై చివరి సెంచరీ సాధించాడు. టెస్ట్, వన్డే, టీ 20 ఈ మూడు ఫార్మాట్లు కలిపి అతడు చేసిన సెంచరీలు 70. ఇవన్నీ అతను కేవలం 4,114 రోజుల్లోనే సాధించడం గ మనార్హం. ఇప్పటికీ 967 రోజులు అవుతున్నా కోహ్లీ నుంచి మరో సెంచరీ రాలేదు. వెయ్యి రోజులు దగ్గర దగ్గరగా వస్తున్న కోహ్లీ 100 పరుగుల మైలురాయిని చేరుకోలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇంటా, బయట వస్తున్న విమర్శల నుంచి ఆయన తప్పించుకోవాలంటే ఒక సెంచరీ చేయడం ఇప్పుడు కోహ్లీకి అనివార్యం. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే కోహ్లీకి చివరి అవకాశం కానుంది. ఇందులోనూ విరాట్ ఎప్పటిలాగానే విఫలమైతే సెంచరీ చేసి వేయి రోజులను దాటేసినట్టే అవుతుంది. ఎందుకంటే విరాట్ ఇప్పుడు కరేబియన్ టూర్ లో లేడు. కాబట్టి తిరిగి బ్యాట్ పట్టేది ఆగస్టు 27 నుంచి జరిగే ఆసియా కప్ లోనే. కానీ అదే ఆగస్టు నెల 18 కి అతను 100 పరుగులు చేయకుండా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ స్టార్ బ్యాటర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 11, 20 పరుగులు చేయగా, రెండో టి-20 లో 11, రెండో వన్డే లో 16 పరుగులు మాత్రమే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ నుంచి మరో శతకాన్ని ఆశించడం అత్యాశ అవుతుందా? లేక మునుపటి ఫామ్ ను అతను దొరకబుచ్చుకొని అందరి విమర్శలకు జవాబు ఇస్తాడా? అనేది నేడు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ తో తేలనుంది.
Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా ?