KCR On Cloud Bursting: మొన్న అమర్నాథ్, నిన్న అస్సాం, నేడు గోదావరి.. ప్రాంతాలు మాత్రమే వేరు. దట్టంగా ఆవరిస్తున్న మేఘాలు, అవి కరగడం వల్ల కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరద మాత్రం ఒకటే. జరుగుతున్న నష్టం ₹వందల కోట్లలోనే ఉంటుంది. అంతెందుకు మొన్న అస్సాంలో జరిగిన వరద బాధితులను ఆదుకునేందుకు సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణ తెలంగాణను గోదావరి ముంచెత్తుతోంది. అప్పుడెప్పుడో 1986 స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులకు మించి ప్రవహిస్తోంది. ఊళ్ళకు ఊర్లు నీట మునిగాయి. పంటచేలన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. చెరువు కట్టలకు గండ్లు పడ్డాయి. చెక్ డ్యాములు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో క్లౌడ్ బరెస్టింగ్ ( మేఘ విస్ఫోటనం) కు పడ్డారని, దీనివల్ల తెలంగాణలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయని ఆరోపించారు. ఈ మేఘ విస్పోటనానికి ఇతర దేశాల వారే కారణమని, గతంలో లేహ్, ఉత్తరాఖాండ్ లో ఇలాంటి చర్యలకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అసలు క్లౌడ్ బరెస్టింగ్ సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమయ్యే పక్షంలో అది ఎలా చేస్తారు? దానివల్ల వాతావరణం ఎదుర్కొనే ప్రతికూల ప్రభావాలు ఏమైనా ఉంటాయా?
జలప్రళయాన్ని ఏ దేశమూ తట్టుకోలేదు
మన దగ్గర వర్షాకాలంలో వానలు ఎలాగో.. అమెరికా లాంటి శీతల దేశాల్లో చలికాలం మంచు తుఫాన్లు అలాగే.. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ ప్రకృతి విపత్తుల సంభవిస్తే ఏదీ కోలుకోలేదు. మొన్నటికి మొన్న పవిత్ర అమర్నాథ్ యాత్రలో జరిగిన జలప్రళయం చూశాం కదా. ఆ జలప్రళయం దెబ్బకు వరదల మాట వింటేనే దేశం వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మనదేశంలో వర్షపాతాన్ని, రాబోయే తుఫాన్లను, నమోదయ్య ఉష్ణోగ్రత వివరాలను ఉపగ్రహ చాయ చిత్రాల ద్వారా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. సాధారణంగా వర్షాలు వచ్చే ముందు వాటిని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కానీ ఇటీవల అస్సాం, అమర్నాథ్, ఉత్తరాఖండ్ వరదలను భారత వాతావరణ శాఖ అంచనా వేయలేకపోయింది. అసలు ఆ స్థాయిలో వరదలు రావడానికి ప్రధాన కారణం క్లౌడ్ బరెస్టింగ్. వాతావరణ శాఖ వివరణ ప్రకారం ఒక చిన్న ప్రాంతంలో ఒకటి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దానిని క్లౌడ్ బరెస్టింగ్ అంటారు. క్లౌడ్ బరెస్టింగ్ ఎన్నిసార్లైనా జరగవచ్చు. అది భౌగోళిక వాతావరణ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: Virat Kohli: 1000 సమీపిస్తోంది 100 ఏది? విరాట్ కోహ్లీ చివరి శతకానికి 967 రోజులు
మే నుంచి ఆగస్టు వరకు క్లౌడ్ బరెస్టింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ
మనదేశంలో మే నుంచి ఆగస్టు వరకు క్లౌడ్ బరెస్టింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ. ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయి. వాస్తవానికి మన దేశంలో రుతుపవనాలు అరేబియా సముద్రం మీదుగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ రుతుపవనాల వల్ల కురిసే వర్షాలే భారత వ్యవసాయ రంగానికి కీలకం. రుతు పవనాలు దక్షిణాన ఉన్న అరేబియా సముద్రం మీద కొంత తేమను తీసుకొస్తాయి. అదే సమయంలో వెస్ట్రన్ డిస్టబెన్స్ కారణంగా మధ్యధర తీరం నుంచి వీచే గాలులు, పశ్చిమాన ఉన్న ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంచెం తేమను తీసుకొస్తాయి. ఈ రెండు ఢీకొన్నప్పుడు ఏర్పడే మేఘాలకు ఎక్కువ సాంద్రత ఉంటుంది. అదే సమయంలో చల్లటి గాలులు వీచినప్పుడు ఎక్కువ వర్షం కురుస్తుంది.
వాస్తవానికి ఇలాంటి సంఘటనలు కొండ ప్రాంతంలో మాత్రమే ఎక్కువ జరుగుతాయి. అందుకే మనదేశంలో కొండ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. మేఘాలయలోని మాసిన్ రామ్, అస్సాంలోని చిరపుంజి ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతాయి కాబట్టే అత్యధికంగా వర్షపాతం నమోదు అవుతూ ఉంటుంది. కానీ తెలంగాణలోనూ ఈమధ్య ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదు అవుతున్నది. శాఖ లెక్కల ప్రకారం దక్షిణ భారతదేశంలో క్లౌడ్ బరెస్టింగ్ వంటి ఘటనలకు ఆస్కారమే లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాంతంలో మేఘాలు పరస్పర ఆకర్షణకు గురవుతాయి కాబట్టి ఎక్కువగా వర్షించే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ అన్నట్టు లేహ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్టింగ్కు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెస్ట్రన్ డిస్టబెన్స్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఆ ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉండటం మరో కారణం. ఒకవేళ క్లౌడ్ డిస్టబెన్స్ కు ఇతర దేశాల వ్యక్తులు పాల్పడినా అంత విస్తారమైన సాంద్రతలో వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉండదు. సీఎం కేసీఆర్ ఏ కోణంలో ఆరోపణలు చేశారనేది పక్కన పెడితే.. దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో క్లౌడ్ బరెస్టింగ్ చేసే అవకాశాలు దాదాపుగా ఉండని వాతావరణ శాఖ అధికారుల అభిప్రాయం.
Also Read:India- America: అమెరికా అయితే నేమీ.. భారత్ కోసం దిగి వచ్చింది