Homeఎంటర్టైన్మెంట్Prabhas Project K: ‘ప్రాజెక్ట్‌ కే’లో మరో హీరోయిన్.. ప్రభాస్...

Prabhas Project K: ‘ప్రాజెక్ట్‌ కే’లో మరో హీరోయిన్.. ప్రభాస్ కెరీర్ లోనే ఇది స్పెషల్

Prabhas Project K: నేషనల్ స్టార్ ప్రభాస్ – యంగ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల కలయికలో రానున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కే’. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించబోతుంది. సీనియర్ క్లాసిక్ హీరోయిన్ శోభన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. శోభన ప్రభాస్ కి తల్లిగా నటిస్తోందట. ఈ సినిమా టీమ్ కి సంబంధించిన వ్యక్తి ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదని.. ఎప్పటికప్పుడు కొత్త పాత్రలను క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

Prabhas Project K
Prabhas

ఈ క్రమంలోనే నటి శోభన పాత్రను కూడా నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. పైగా శోభన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

Also Read: Samantha- Naga Chaitanya: చైతు – స‌మంత కాపురం గుట్టు చెప్పిన సీనియ‌ర్ హీరో.. ఉద‌యమే సమంత ఏం చేసేది అంటే ?

పక్కా సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టే.. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమా వచ్చే వారంలో యాక్షన్ సీన్స్ కోసం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ సీన్స్ షూట్ ను శరవేగంగా షూట్ చేయనున్నారు. ఇక మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Prabhas Project K
nag ashwin, Prabhas

అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నాడు. పైగా ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడు. అలాగే, పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు.

మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి. ఒక్కటి అయితే.. ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే స్పెషల్ గా ఉండబోతుంది.

Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలో తెలుసా ?
Recommended Videos
సామ్ -  చైతు లాగే విడాకులు తీసుకుంటున్న  క్రేజీ కపుల్ ||  Deepika Padukone  Ranveer Singh Divorce
Vijay Devarakonda Mass Speech || Liger Trailer Launch Event || Puri Jagannadh || Sudharshan Theater
హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన హీరో సిద్దార్థ్ || Hero Siddharth with Heroine in Hotel
పుష్ప 3  హీరో  విజయ్ దేవరకొండ || Allu Arjun || Vijay Devarakonda || Fahad || Pushpa2 || Pushpa3

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version