https://oktelugu.com/

Vykunta Ekadasi 2025: రేపే వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేశారో దరిద్రం ఇక మీతోనే!

ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఎంతో నిష్టగా విష్ణువును పూజిస్తారు. భక్తితో పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అయితే కొందరు తెలియక కొన్ని తప్పులను ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేస్తారు. వీటివల్ల దరిద్రం వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి వైకుంఠ ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2025 / 07:25 PM IST

    Vaikunta Ekadasi

    Follow us on

    Vykunta Ekadasi 2025: హిందు సాంప్రదాయంలో ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా తిథులతో పోలిస్తే ఏకాదశిని చాలా పవిత్రంగా పూజిస్తారు. అయితే ప్రతీ నెల ఒక ఏకాదశి తప్పనిసరిగా వస్తుంది. ఇలా ఏడాది మొత్తంలో వచ్చే ఏకాదశిలో కంటే ఈ నెలలో వచ్చే ముక్కోటి ఏకాదశి(Vykunta Ekadasi) ఎంతో పవిత్రమైనది. ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును(Vishnuvu) పూజించి ఉపవాస దీక్ష ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వార దర్శనం(Darshanam) చేసుకుని ఎంతో నిష్టగా విష్ణువును పూజిస్తారు. భక్తితో పూజించడం(Puja) వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అయితే కొందరు తెలియక కొన్ని తప్పులను ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేస్తారు. వీటివల్ల దరిద్రం వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి వైకుంఠ ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    వైకుంఠ ఏకాదశి రోజు ఎంతో భక్తితో పూజించాలి. ఇతర ఏ ఆలోచనలు లేకుండా కేవలం విష్ణు నామస్మరణం చేయాలి. కొందరు ఈ రోజు ఉపవాసం ఉండరు. దీనికి తోడు అన్నం తింటారు. వైకుంఠ ఏకాదశి నాడు పూర్తిగా అన్నం తినకూడదని పండితులు చెబుతున్నారు. ఉపవాస దీక్ష చేస్తుండాలి. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. ఇతరులను కోపగించుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇతరులప ఈర్ష్య ఉండకూడదు. అంతా సానుకూలంగా ప్రతీ విషయాన్ని నడుచుకోవాలి. జుట్టు, గోళ్లు వంటివి కత్తిరించుకోకూడదు. భక్తితో ఈ నియమాలు పాటిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించి తర్వాత రోజు ఉపవాసం విరమించాలి.

    ప్రతి ఏడాది సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు. దీని కంటే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. అలాగే పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలు అందరితో కలి భూలోకంలోకి అడుగు పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి అనే స్వర్గానికి మార్గమని, దానికి వెళ్లడానికి ఈ ఏకాదశి నాడే ఓపెన్ అవుతుందని చెప్పుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 9న గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభం అవుతుంది. తర్వాత రోజు జనవరి 10న శుక్రవారం ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అంటే ఉదయం తిథి ఉండటంతో జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఉపవాసం ఉన్నవారు 9వ తేదీ నుంచే పాటిస్తారు. మధ్యాహ్న తిథి సమయం నుంచి ఉపవాసం ఆచరించి తర్వాత రోజు తిథి అయ్యాక పూర్తి చేస్తారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.