Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : తిరుపతి ఎస్పీ పై వేటు.. మరో ఇద్దరిపై.. చంద్రబాబు సీరియస్.. విజిలెన్స్...

CM Chandrababu : తిరుపతి ఎస్పీ పై వేటు.. మరో ఇద్దరిపై.. చంద్రబాబు సీరియస్.. విజిలెన్స్ విచారణ!

CM Chandrababu :  తిరుపతి( Tirupati) తొక్కిసలాట ఘటన పై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ తో( district collector) పాటు ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టీటీడీ అధికారుల తీరుపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా అక్కడ పోలీస్ అధికారులకు ఎలాంటి విధులు కేటాయించారని అడిగారు. టోకెన్ జారీ కేంద్రాల్లో తొక్కిసలాట నియంత్రణకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంతమంది యంత్రాంగం ఉండి కూడా టోకెన్ల జారీ ప్రక్రియలో ఈ అపశృతి ఏంటని నిలదీశారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ లో ఎన్ని టిక్కెట్లు జారీ చేశారు? ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది అంటూ సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

* ఘటనా స్థలం పరిశీలన
రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి( Tirupati) చేరుకున్న చంద్రబాబు.. తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ పరిస్థితిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అధికారులతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని.. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు సీఎం. బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా విధులు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు. భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ ఫైర్ అయ్యారు.

* కలెక్టర్,ఎస్పీ పై ఫైర్
ముఖ్యంగా తిరుపతి జిల్లా కలెక్టర్ పై( district collector) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అటు ఎస్పీపై కూడా ఫైర్ అయ్యారు. ఇది పద్ధతి కాదు.. పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి.. మీరు సమాధానం చెప్పండి.. ఈ కేంద్ర వద్ద ఎందుకు ఫెయిల్ అయ్యారు.. ప్రతి ఒక్కరికీ చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి.. తమాషాలనుకోవద్దు.. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.. అంటూ కలెక్టర్ తో పాటు ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

* విజిలెన్స్ ఎంక్వైరీ కి ఆదేశం
కాగా ఈ ఘటనపై ప్రభుత్వం( ap government ) సీరియస్ గా ఉంది. విజిలెన్స్ ఎంక్వయిరీ( Vigilance enquiry) వేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. డీఎస్పీ రమణ కుమార్ పై వేటు వేశారు. గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి ని సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు తో పాటు జేఈవో గౌతమి, సి ఎస్ ఓ శ్రీధర్ ను తక్షణం బదిలీ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.

* తీవ్ర స్థాయిలో హెచ్చరిక
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చంద్రబాబు( Chandrababu) మాట్లాడారు. ఇకనుంచి అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు టిటిడి తరఫున 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున సాయం కూడా ప్రకటించారు. గాయపడిన 33 మందికి రెండు లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. గాయపడిన ఆ 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version