Homeఆధ్యాత్మికంToday May 3rd 2026 Horoscope: ఈ ఐదు రాశుల వ్యాపారులకు ఈరోజు లాభాల...

Today May 3rd 2026 Horoscope: ఈ ఐదు రాశుల వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండినట్లే..

Today May 3rd 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణఉండడంతో అధికంగా లాభాలు పొందుతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో జరిగే వివాహం కార్యక్రమంతో బిజీగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనే ఆచితూచి వ్యవహరించాలి. పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలు వింటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనవలసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆస్తిని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల్లో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంశాలు అందుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొత్త వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఏదైనా వివాదం జరిగేటప్పుడు పట్టించుకోకుండా ఉండడమే మంచిది. మాటలు తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా చేసే ప్రయాణం వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడంతో ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మానసికంగా ఆందోళన ఉండడంతో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీంతో వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అయితే బంధువుల నుంచి కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే మాటల తీరును మెరుగుపరచుకోవాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో ఏర్పాటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. దీంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి నిరుద్యోగులు ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు బంధువులనుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular