spot_img
Homeజాతీయ వార్తలుIMD Monsoon Forecast 2026: హీటెక్కిన తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే..

IMD Monsoon Forecast 2026: హీటెక్కిన తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే..

IMD Monsoon Forecast 2026: ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఇక మే ప్రారంభం కావడంతో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే రెండో వారంలో మొదలయ్యే హీట్‌వేవ్‌ సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈసారి ఏప్రిల్‌ 14 నుంచి 14 రోజులపాటు నమోదైన ఉష్ణోగ్రతలు చారిత్రక రికార్డు. మే మొదటి వారంలో 47ని వరకు రావచ్చని ఐఎండీ అంచనా వేసింది. వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.

ముందస్తుగా రుతుపవణాలు..
ఈ క్రమంలో ఐఎండీ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈసారి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వెల్లడించింది. మే 14 లేదా 15వ తేదీన అండమాన్‌లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణం కన్నా 5 నుంచి 7 రోజులు ముందగా వస్తాయని అంచనా వేసింది. ఇక ఈసీజన్‌లో దేశవ్యాప్తంగా 105–110 శాతంఒ సగటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ–పశ్చిమ భారతంలో ఎక్కువగా కురుస్తాయని ఈశాన్య భారతంలో తక్కువగా కురుస్తాయని తెలిపింది.

ముందస్తు ప్రభావాలు..
ఈసారి అధిక ఉష్ణోత్రల కారణంగా మొక్కలు చనిపోవడం, పశువుల మరణాలు పెరిగాయని తెలిపింది. 20 నుంచి 30 శాతం పంటలు ఎండిపోయాయని అంచనా వేసింది. అయితే ఈసారి మాన్సూన్‌ ముందుగా రావడం పంటలకు లాభమని తెలిపింది. అయితే అధిక వర్షాలు వరదలు కూడా పంటలను దెబ్బతీస్తాయని వెల్లడించింది.

ఎల్‌నినో, హిందూ మహాసముద్రంలో ఓషాన్‌ డిపోల్‌ ప్రభావంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. మాన్సూన్‌ ముందుగా రావడం (2020లా) ఉపశమనం ఇస్తుందని పేర్కొంది. కానీ అసమాన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రమాదాలు పెంచుతాయని అంచనా వేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper