Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త.. ఎందుకంటే?

Today Horoscope In Telugu: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త.. ఎందుకంటే?

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాశిలపై పూర్వభద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడితే పెడతారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో వీటిని పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల కెరీర్ పై శుభవార్తలు వింటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటాడు. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు పలుస్తాయి. పిల్లల కెరీర్ పై చేసే పెట్టుబడులు సత్ఫలితాలను స్థాయి. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం చర్చించుకుంటారు. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం చేపట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసిన పెట్టుబడును సత్ఫలితాలను స్థాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడి నుంచి బయటపడతారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి జీతం పెరుగుతుంది. విద్యార్థులు కెరీర్ కోసం చేసే ప్రయత్నాలు కలుస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహ రాశి వారికి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు కొన్ని పనులు పూర్తి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సాయంత్రం స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి ఈ రోజు సంతోషంగా జీవితం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. వ్యాపారులు నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అయితే శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. విద్యార్థులతో కలిసి ఉంటారు. వారికి గురువుల మద్దతు ఉంటుంది. దీంతో ఏ పరీక్షల్లో పాల్గొన్న విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈరోజు ఆర్థిక సంబంధించిన వివాదాలు తలెత్తుతాయి. అయితే ఓపికతో సమస్యలు పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. డబ్బు అవసరం ఉంటే బంధువుల నుంచి సహాయం అందుతుంది. పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మాటలు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాల్సి వస్తే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. అయితే పెట్టుబడుల కోసం బ్యాంకు రుణం కోసం చేసే ప్రయత్నాలు కలుస్తాయి. బంధువుల్లో ఒకరి వివాహం కోసం బిజీగా మారుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది. అందువల్ల కొత్త వారితో ఒప్పందాలు చేయడం ఆపేయాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉండలు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచించేవారు తల్లితండ్రుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రణాళికల ద్వారా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ నైపుణ్యాల ద్వారా ఆ సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులు కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి రుణం అందుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి ఇవ్వాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొత్త పనులను ప్రారంభిస్తారు. ఇవి వెంటనే పూర్తి అవుతాయి.పెండింగ్లో ఉన్న పనుల కోసం తీవ్రంగా శ్రమిస్తారు. కుటుంబ సభ్యులు చేసే కొన్ని డిమాండ్లను నెరవేరుస్తారు. ఆర్థికంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయితే బంధాల నుంచి ధన సహాయమందుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పదోన్నతిని పొందుతారు. గతంలో ఏదైనా వివాదం ఉంటే నీటితో పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యమైనవి గుర్తుంచుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి ఇవ్వాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సమకూరడంతో కాస్త ఉపశమనం లభిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular