Homeఆధ్యాత్మికంToday Horoscope In Telugu: ఈరోజు పంచగ్రహి యోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం..

Today Horoscope In Telugu: ఈరోజు పంచగ్రహి యోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం..

Today Horoscope In Telugu ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అయితే కొందరి మాటల వల్ల కాస్త నిరాశను ఎదుర్కొంటారు.

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు పంచ గ్రహీ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని పనులు అహంపూర్తిగా ఉంటాయి. నీతో నిరాశతో ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు సాధారణ లాభాలు పొందుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. కానీ కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెండింగ్ పలాలను పూర్తి చేయలేరు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి బహుమతిని పొందవచ్చు. అంతేకాకుండా కొందరు ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఇంటి కోసం అప్పులు చేస్తారు. అయితే ఇవి భవిష్యత్తులో తీర్చు అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు కెరీర్ పై ఫోకస్ పెడతారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు వెళ్లాల్సి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటే విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో కలిసి లక్ష్యాలను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అయితే కొందరి మాటల వల్ల కాస్త నిరాశను ఎదుర్కొంటారు. అయితే ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యాపారాలు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా కొన్ని మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఏదైనా కోరికలు ఉంటే తీర్చుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకుంటారు. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం కారణంగా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా కనిపిస్తారు. ముఖ్యమైన వ్యక్తిని కలవడంతో కొత్త పనిని ప్రారంభిస్తారు. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఇచ్చిన సమస్య వచ్చిన వెంటనే వైద్యుడును సంప్రదించాలి. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు నిరాశ వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యమైన ప్రణాళికలు వేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారు. అయితే కొన్ని నిర్ణయాలు నష్టం కలిగించే అవకాశం ఉంది. వ్యాపారుల పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆందోళనగా కనిపిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళనతో ఉంటారు. కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు ఈ రోజు సామాజిక సేవలో పాల్గొంటారు. దీంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారులు ప్రత్యర్థులను జయించి లక్ష్యాలను పోటీ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే తొలగిపోతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎదుటివారికి దానధర్మాలు చేస్తారు. కారణంగా బిజీగా కనిపిస్తారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆహారంలో నాణ్యత పాటించాలి. ఉద్యోగులు అధికారులు పొందుతారు. చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper