Today 9 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. మరికొన్ని రాశుల వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే వ్యాపారులకు ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఉద్యోగాల్లో గొప్ప పేరు తెచ్చుకుంటారు. గతంలో ప్రారంభించిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరగడంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పేదలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న సమయం ఉంటుంది. దీంతో ఏ పని మొదలుపెట్టిన దానిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : .. ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అవసరం ఉన్న మీరకే ఖర్చులు పెట్టాలి. పేతురుతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా డబ్బు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ప్రణాళిక లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఆగిపోయిన డబ్బు విషయంలో ఆందోళన చెందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు చాలా రంగాల్లో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో జరిగే శుభకార్యానికి బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో ప్రారంభించిన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. కష్టపడిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు చాలా రంగాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు వీరి సహకారం ఉండడంతో లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువులను సంప్రదించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :. ఈ రాశి వారు ఈ రోజు పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పడుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. ఉద్యోగులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తల తీర్చకుండా ఉండడమే మంచిది. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దలు సలహా ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ముందు జాగ్రత్తతో పనులు వ్యవహరించాలి. కొన్ని పనుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. అనవసరంగా ఎవరితోనూ వివాదాల్లోకి తలసూర్చకుండా ఉండాలి.