The Raja Saab Premiere Show Review: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాజా సాబ్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ క్రమం లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు వేశారు. మరి ఈ ప్రీమియర్లను బట్టి సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
స్వతహాగా రాజాసాబ్ అయిన హీరో(ప్రభాస్ )తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అతన్ని దుష్టశక్తులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి… అసలు ఆ ఇంటికి అతనికి సంబంధం ఏంటి? వాళ్ళ నాన్నమ్మ చివరి కోరిక ఏంటి? దానికోసం హీరో ఏం చేశాడు. అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
మారుతి ఈ సినిమాను హార్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ప్రభాస్ ను ఒక డిఫరెంట్ పాత్రలో చూపించాలనే ఉద్దేశ్యంతో మారుతి ఈ కథనైతే చేశాడు… ఓవరాల్ గా సినిమా స్టోరీ ఓకే అనిపించినప్పటికి మారుతి హ్యాండిల్ చేసిన విధానం బాలేదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక హై ఇచ్చే ఎపిసోడ్ వచ్చింది. ఇక సెకండాఫ్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది…
ఓవరాల్ గా సినిమా మాత్రం స్లో నేరేషన్, కన్ఫ్యూజినింగ్ స్క్రీన్ ప్లే తో క్లారిటీ లేకుండా పోయింది. దానివల్ల సినిమా చూస్తున్నంత సేపు ఏదో వెలితిగానే అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులకు బోర్ కొట్టించే అవకాశం కూడా ఉంది… స్క్రీన్ మీద ప్రభాస్ కనిపిస్తున్నప్పటికి అంత బోరింగ్ సన్నివేశాలను మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. మారుతి చిన్న హీరోలను హ్యాండిల్ చేసిన విధానంలోనే ప్రభాస్ ని హ్యాండిల్ చేయాలని చూశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు.
ఎందుకంటే ప్రభాస్ కి ఉన్న చరిష్మా తనకున్న స్టార్ డమ్ ని కంపేర్ చేసుకుని ఎలివేషన్స్, ఎమోషన్స్ రాసుకొని ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది… కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికి సినిమా ప్రేక్షకుడిని మెప్పించలేక పోయిందనే చెప్పాలి… ఇక తమన్ మ్యూజిక్ సైతం ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. కొన్ని పాటలు అయితే బాగున్నాయి. అలాగే కొన్ని హర్రర్ సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది… ఇక ఈ సినిమాకి ఉన్న అత్యంత ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ అనే చెప్పాలి… గతంలో ఆయన చేసిన బుజ్జిగాడు సినిమా తాలూకు రిఫరెన్స్ తోనే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక కామెడీని పండించే ప్రయత్నం చేశాడు…
