Raja Saab Twitter Talk: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) మూవీ నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా మొదలైంది. నైజాం ప్రాంతం లో ప్రీమియర్స్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, నిర్మాతలు చివరి నిమిషం వరకు ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రీమియర్ షోస్ పడేలా ప్రయత్నం అయితే చాలా గట్టిగానే చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పడం తో 10:30 గంటలకు మామూలు టికెట్ రేట్స్ తో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. బుకింగ్స్ మొదలు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. అయితే ప్రీమియర్ షోస్ ముగిసిన తర్వాత ఈ సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఇప్పుడు ఇప్పుడు మనం చూడబోతున్నాము.
#TheRajaSaab A Horror/Fantasy Drama with an interesting concept and an energetic Prabhas, but a clumsy and disjointed screenplay make it tiresome!
The core concept is intriguing, and a few sequences built around it work well, especially the pre-climax. However, the commercial…
— Venky Reviews (@venkyreviews) January 8, 2026
ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమాని చూసిన వాళ్ళు పర్వాలేదు, ఎదో అలా ఉంది అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ వేశారు. మారుతీ స్టోరీ, కంటెంట్ ఏమి లేకుండా, ఫిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ని సాగదీశాడని అంటున్నారు.

ముఖ్యంగా హీరోయిన్స్ తో ప్రభాస్ ట్రాక్ చాలా అవుట్ డేటెడ్ గా ఉందని అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈమధ్య కాలం లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, ఎందుకంటే అవి ఆడియన్స్ కి చాలా ఫ్రెష్ గా అనిపించాయి కాబట్టి. కానీ ఇక్కడ మాత్రం అవుట్ డేట్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆసక్తి కరమైన స్క్రీన్ ప్లే రాసుకున్నది అంటున్నారు చూసిన వారంతా. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సన్నివేశం తప్ప ఏమి లేదు అనేది ట్విట్టర్ టాక్.
Enduku ra
Part -2
Ee first ke champesaav #TheRajaSaab pic.twitter.com/4HKDz6E48G— Alternative (@pavantarakian98) January 8, 2026
ఇక సెకండ్ హాఫ్ కచ్చితంగా బలంగా ఉండాలి, లేదంటే కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ని చూడాల్సి వస్తుందని మనకి అర్థం అయిపోతాది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మారుతి సెకండ్ హాఫ్ ఎలా డీల్ చేసి ఉంటాడో అని గుండెలు అరచేతిలో పెట్టుకొని ఈ సినిమాని చూసారు. కానీ సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉందని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ప్రభాస్ లాంటోడిని పెట్టుకొని ఇలాంటి సినిమా చెయ్యాలనే ఆలోచన ఆ మారుతి కి ఎలా వచ్చింది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయ్యుండి ప్రభాస్ ఒక మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు, తనవైపు నుండి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చాడు, కానీ డైరెక్టర్ మారుతీ టేకింగ్ లో లోపం ఉండడం వల్ల ఈ సినిమాకి ఇలాంటి బ్యాడ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో కొన్ని ట్వీట్స్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
#TheRajaSaab – A horror-comedy movie with zero horror and comedy . An okay-ish first half followed by a decent second half. Climax fight & Visuals were good. Aged-look Prabhas scenes were missing, and the Part-2 lead felt completely unnecessary. Overall, a disappointing movie… pic.twitter.com/SQnPAOdBVO
— Krishna Kumar (@krishna_kumar_r) January 8, 2026