Homeఆధ్యాత్మికంToday 9 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా..?

Today 9 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా..?

Today 9 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు కొత్తగా పెట్టుబడును పెడతారు. మరికొన్ని రాశుల వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,p): కొన్ని పనుల కారణంగా ఈ రాశి వారు ఈరోజు బిజీగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని రహస్యాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది. ఇంటికి అతిధులు రావచ్చు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. దీంతో ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో అధిక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడడానికి మార్గం పడుతుంది. కుటుంబ సభ్యుల అండదండలు ఉండటంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వీటిని అధిగమించడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ఉద్యోగులు అధికారుల మద్దతు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పెట్టుబడుల విషయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దీంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరుగుతాయి. కానీ వీటిని పూడ్చడానికి ఆదాయాన్ని పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు గణనీయమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. చుట్టాల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ప్రత్యర్థులపై ఈరోజు విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే అనవసరపు వాదనకు దూరంగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. పెండింగు బిల్లులు వసూలు అవుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version