Homeఆధ్యాత్మికంToday 4 February 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలం.. కొత్తగా...

Today 4 February 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలం.. కొత్తగా పెట్టుబడులు పెట్టే ఛాన్స్..

Today 4 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. మరికొన్ని రాశుల వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. […]

Today 4 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. మరికొన్ని రాశుల వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. చేసే ప్రతి పనిలో విజయవంతం అవుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. దీంతో కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు మెరుగైన లాభాలు ఉండనున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని వెంటనే పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి ధన సహాయ పొందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కష్టపడిన వారికి తగిన ఫలితాలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తుపై కీలకమైన తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందనున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. దీన్ని తట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక వేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు తెలివితేటలను ప్రదర్శించడం వల్ల పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లోనే రహస్యాలు ఎవరికి చెప్పుకోకూడదు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పథకాలను పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా జీవిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని ముఖ్యమైన ఫలితాలు పొందుతారు. కొత్తగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారులకు భాగస్వాముల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారం లాభాల పంట పండుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల నుంచి ధన సహాయం ఉంటుంది. కొత్తగా ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. అనుకోకుండా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper