Today 29 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఏర్పడుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి వ్యాద యాత్రలకు వెళ్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. తోటి వారితో సంయమనం పాటించడంతో వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. అనవసరపు వివాదాలలోకి తలదూర్చకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేపట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొన్నింటిలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల చేపట్టిన ప్రతి పనిని పూర్తిచేసే వరకు వదలొద్దు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారంలో ఎప్పుడు లాభాలు పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగులు తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల కోసం పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సమస్యలను ఎదుర్కొంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదురుచకుండా ఉండాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : దూర ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్థికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉండడంతో అన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ఐశ్వర్యవంతులు కావడానికి మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు సకాలంలో ఆదాయం సమకూరుతుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. అయితే పని భారం పెరిగి నిరాశతో ఉంటారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగ స్వాములతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లొద్దు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తిచేస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమానికి హాజరవుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే వ్యాపారులు పెద్దలను సంప్రదించడం మంచిది.
