Today 28 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెట్టుబడిన విషయంలో పెద్దలను సంప్రదించాలి. వ్యాపారులకు కొందరు ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. అయితే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అడ్డంకులు లేకుండా పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల సహాయంతో అప్పులు తీరుస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి ఆరోగ్యం ఈరోజు మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన జీవితాన్ని గడుపుతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు లాభాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది ఇంట్లో జరిగే శుభకార్యానికి అతిథులు వస్తారు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణఉండడంతో కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు తాము చేసే పనుల్లో పురోగతిని సాధిస్తారు. పెట్టుబడేల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో చదివేందుకు పయనం అవుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కోరికలను నెరవేర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగుల అదనపు ఆదాయం కోసం శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపారంలో అనేక పెట్టుబడులు పెడతారు. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆశించిన మేరకు లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. వారు చేసే పనులన్నింటిలో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు తాము చేసే పనుల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. గురువుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా కాస్త ఓపికతో వ్యవహరించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సపోర్టు ఉండటంతో చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు.
