Homeఆధ్యాత్మికంToday 25 November 2025 Horoscope: ఈ రాశుల వారికి ధనయోగం.. ఉద్యోగులకు అదనపు ఆదాయం..

Today 25 November 2025 Horoscope: ఈ రాశుల వారికి ధనయోగం.. ఉద్యోగులకు అదనపు ఆదాయం..

Today 25 November 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాజుల వారికి ధనయోగం పట్టణం ఉంది. మరికొన్ని రాశుల వారు ప్రతికూల పరిస్థితులను పేర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఉద్యోగంలో కొత్త ప్రణాళికలను చేపడతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనుషులు మధ్య సంబంధాలు పెరిగిపోతాయి. ఊహించని విధంగా వ్యాపారులకు లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు చెప్పుడు మాటలు వినకుండా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అయితే అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారు కొన్ని రోజులపాటు వెయిట్ చేయడం మంచిది. వ్యాపారులకు ఈరోజు ప్రతికూల వాతావరణ ఉండే అవకాశం ఉంది. భాగస్వాములతో ఎటువంటి వాదనలకు దిగకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉండటంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలకు విషయాలపై ఎవరిని నమ్మొద్దు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సమస్యలు నీటితో పరిష్కారం అవుతాయి. పిల్లల భవిష్యత్తుపై ఇలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతవరకు డబ్బులు నష్టపోయే అవకాశం కూడా ఉంది. అయితే జీవిత భాగస్వామి మద్దతుతో సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారినించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు భారం పడుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొన్ని వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరితోనో డబ్బు వ్యవహారాలు పంచుకోకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన సమాచారం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారు కొన్ని రోజులపాటు వెయిట్ చేయడం మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల నుంచి ప్రసంగిలో అందుకుంటారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో గతంలో కంటే ఎప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈరోజు వారు తండ్రి సలహాలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టబడులను జలాభాలు పొందుతారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు ఈరోజు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కొత్త భాగస్వాములను చేర్చుకోకపోవడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular