spot_img
Homeఆధ్యాత్మికంToday 2 April 2026 Horoscope: హనుమాన్ జయంతి వేళ ఈ రాశుల వారికి ఈరోజు...

Today 2 April 2026 Horoscope: హనుమాన్ జయంతి వేళ ఈ రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే..

Today 2 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గతంలో కంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిని పూర్తి చేయడానికి అధికారుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అందుతాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు అందుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు గణనీయమైన లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లాభాలు రావడానికి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్తులో ఫలించే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధించడానికి సరైన మార్గం తెలుస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని రహస్యాలను బయట వారికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకోకుండా శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు ఉండడంవల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బు వ్యవహారంలో ఎవరిని నమ్మకుండా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ప్రతికూల వార్తలు వినాల్సి వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపడితే జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular