Pakistan Super League 2026 Criticism: ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరితే ఎలా ఉంటుంది.. అచ్చం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాదిరిగా ఉంటుంది. ఐపీఎల్ మార్కెట్ విలువ లక్షల కోట్లకు చేరిన నేపథ్యంలో.. ఐపీఎల్ మొత్తాన్ని కాపీ చేసి.. దానికి పాకిస్తాన్ సూపర్ లీగ్ అని నామకరణం చేసింది. ఐపీఎల్ మొత్తాన్ని బీట్ చేస్తామని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే హైయెస్ట్ వాల్యూ ఉన్న సూపర్ లీగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
Also Read: అట్లాంటాలో ‘తానా’ సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పలికిన మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఉదాహరణకు ఇటీవల రాజస్థాన్ జట్టు.. బెంగళూరు జట్టు చేతులు మారితేనే దాదాపు 32 వేల కోట్లకు మించిన లావాదేవీలు జరిగాయి. ఇక మిగతా ఎనిమిది జట్లు చేతులు మారితే ఎంత స్థాయిలో నగదు స్పెక్యులేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష కోట్ల మార్కెట్ వ్యాల్యూను ఐపీఎల్ ఎప్పుడో దాటేసింది.. వ్యాల్యూ ను మరింత పెంచుకునేందుకు ఐపీఎల్ నిర్వాహ కమిటీ అడుగులు వేస్తోంది.
ఐపీఎల్ ను చూసి ఏదో చేద్దామని అనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. యుద్ధం నేపథ్యంలో కేవలం రెండు మైదానాలలో మాత్రమే మ్యాచులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ ఉండడంతో ప్రజలు మైదానాలకు రావడం లేదు. ఇక ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తున్న ఓ మైదానంలో వర్షం కురిసింది. వర్షం నుంచి పిచ్ ను రక్షించేందుకు సాధారణంగా టార్పాలిన్ లు కప్పుతారు. వాన నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి పంపిస్తారు. వర్షం తగ్గిన తర్వాత పిచ్ మొత్తాన్ని అత్యంత ఆధునికమైన యంత్రాలతో ఆరబెడతారు. చివరికి జింబాబ్వే లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉంది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గల్లీ క్రికెట్ మాదిరిగా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తోంది.
ఇటీవల కురిసిన వర్షానికి అక్కడ మైదానాన్ని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అవుట్ ఫీల్డ్ మీద పరదాలు కప్పారు. గాలుల తాకిడికి ఆ పరదాలు మొత్తం ఎగిరిపోయాయి. కొన్ని పరదాలు అయితే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. అవుట్ ఫీల్డ్ మొత్తాన్ని కవర్ చేయడానికి పరదా లేకపోవడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేకితనాన్ని సూచిస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది.. కనీసం ఔట్ ఫీల్డ్ మీద పరదాలు కప్పలేనివారు.. సూపర్ లీగ్ టోర్నీ ఎలా నిర్వహిస్తారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
Wait, What’s Happening in PSL
– Poor Drainage
– Covers Flying
– Pak Fans Crying on X #PBKSvsGT pic.twitter.com/MrSxhxqsnE— Ajay Jadeja (@AjayJadeja171) March 31, 2026
