Today 18 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఐదు రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాజు వారు ఈరోజు గ్రహాల అనుకూలతతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేసుకోవడం ద్వారా అధిక లాభాలను పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. అప్పులు తీర్చేందుకు మార్గం ఏర్పరచుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులను నమ్మద్దు. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. ఉద్యోగులకు ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. అయితే ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. గతంలో శత్రువులు ఉన్నవారు ఎప్పుడు మిత్రులుగా మారతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలను వింటారు. నిరుద్యోగులకు కంపెనీలనుంచి సమాచారం అందుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీరేందుకు మార్గం ఏర్పడుతుంది. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది. వ్యాపార అభివృద్ధికి ఇతరుల సహకారం తీసుకుంటారు. దూరప్రాయణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సరైన లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూలమైన వాతావరణము ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తరలించకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల సహకారంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పరిస్తాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వారి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థులు నిరాశతో ఉంటారు. అయితే వీరికి గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.