Today 18 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశిలపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే తోటి వారి సహాయంతో వీటి నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయం కేటాయిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి వ్యాపారులు కష్టపడాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో సమస్యలు ఉంటే బయటపడతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు. కొందరి సహకారం వల్ల మనసు ప్రశాంతంగా అవుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మానసికంగా ఆందోళనగా ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగులు తోటి వారి సహాయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. వ్యాపారులు తోటి భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా పనిచేస్తారు. గతంలో చేపట్టిన పనులు పూర్తికావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : జీవిత భాగస్వామితో ఈరోజు విభేదాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు డబ్బు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయడంతో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. పూర్వికులు ఆస్తి విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో సమస్యలు ఎదురైతే సహనంతో ముందుకు వెళ్లాలి. జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు గతంలో కంటే ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఆదాయం పెరిగినా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయితే దుబారా ఖర్చుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సన్నిహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం లో ఉంటారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. వ్యాపారులు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తిచేసే క్రమంలో ఇబ్బందులు పడతారు. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ప్రియమైన వారికోసం ఈరోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులో కొందరి వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇతరులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశించిన లాభాలు రాకపోవడంతో వ్యాపారులు నిరాశతో ఉంటారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది బంధువుల నుంచి ధన సహాయ మండుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులు కొన్ని పనుల ద్వారా అధికారులను ఆకట్టుకోగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వ్యాపార అభివృద్ధికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు గురువుల సహాయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఏ రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు అవకాశాలు పొందుతారు.