Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్ రైజర్స్.. ఈసారైనా సత్తా చూపిస్తుందా.. బలాలు.. బలహీనతలు...

Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్ రైజర్స్.. ఈసారైనా సత్తా చూపిస్తుందా.. బలాలు.. బలహీనతలు ఇవే!

Sunrisers Hyderabad IPL 2026 analysis: ఇదీ హైదరాబాద్ జట్టు చరిత్ర: దక్కన్ చార్జర్స్ నుంచి.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆవిర్భవించింది.. 2012 అక్టోబర్ 25న ఈ జట్టు కొత్తగా వచ్చింది. కళానిధి మారన్ యాజమాన్యంలో సన్ నెట్వర్క్ ఈ జట్టును కొనుగోలు చేసింది. 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం హోమ్ గ్రౌండ్ గా ఉంది. హైదరాబాద్ జట్టుకు డేనియల్ వెటోరి కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

2016లో విజేతగా..
హైదరాబాద్ జట్టు 2013లో మొదటి ఐపిఎల్ మ్యాచ్ ఆడింది. ఆ సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్ళింది. 2016లో బెంగళూరుకు జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. 2016 నుంచి 2020 మధ్య ఐదు సీజన్లో వరుసగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది హైదరాబాద్. 2018లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. చెన్నై జట్టు చేతిలో ఓడిపోయింది..
అనేక రికార్డులు సొంతం
అత్యుత్తమ బౌలింగ్ వేసే ప్లేయర్లతో హైదరాబాద్ అత్యంత బలమైన జట్టుగా రూపాంతరం చెందింది. 2024లో ఏకంగా 287 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.. ఈ జట్టులో డేవిడ్ వార్నర్ అనే ఆటగాడు 2015, 2017, 2019లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 2016, 2017లో భువనేశ్వర్ కుమార్ రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ప్రధాన బౌలర్ గా అవతరించాడు.
జట్టు విలువ పడిపోయింది
కోవిడ్ సమయంలో హైదరాబాద్ జట్టు బ్రాండ్ విలువ దారుణంగా పడిపోయింది. 2020లో 57.4 మిలియన్ డాలర్లకు జట్టు విలువ పడిపోయింది. జట్టు విలువ పతనంలో ఇది నాలుగు శాతం కావడం విశేషం.
ప్రధాన ప్లేయర్లు వీళ్లే
హైదరాబాద్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుగా పాట్ కమిన్స్, కిషన్, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్,  రాహుల్ చాహర్, లివింగ్ స్టోన్ వంటి ప్లేయర్లు కీలకంగా ఉన్నారు.
సారధికి వెన్నునొప్పి

ప్రస్తుతం కెప్టెన్ కమిన్స్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. 2024లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. హైదరాబాద్ జట్టు టైటిల్ అందుకోలేకపోయింది. 2025లో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే ఈసారి జట్టు యాజమాన్యం సమర్థవంతమైన ప్లేయర్లను తీసుకున్న నేపథ్యంలో టైటిల్ మీద అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వెటోరీ ప్లేయర్లతో ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

Also Read: అభిషేక్ శర్మ కాదు.. సన్ రైజర్స్ కు కెప్టెన్ కావాల్సింది అతడే! కావ్య కు ఎవరైనా చెప్పండయ్యా..

డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన ప్లేయర్లతో..
డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన అన్సారి, జయదేవ్, ప్రపుల్, శివమ్ మావి వంటి బౌలర్లకు మెలకువలు నేర్పుతున్నారు. హర్షల్ పటేల్, కమిందు మెండిస్, శివాంగు కుమార్, కార్స్ వంటి ప్లేయర్లకు అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్లో తర్ఫీదు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఈసారి హైదరాబాద్ జట్టు గత ఏడాది ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని.. ఈసారి సరికొత్తగా కనిపిస్తుందని హైదరాబాద్ యాజమాన్యం చెబుతోంది.
ఇవే బలాలు
హైదరాబాద్ జట్టులో బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా ఈసారి కూడా అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ నిలువ బోతున్నారు. వీరితోపాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ప్రధాన అస్త్రంగా ఉండబోతున్నాడు.  హెడ్ ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడ లేక పోయినప్పటికీ.. ఐపీఎల్ నాటికి అతడు ఫామ్ లోకి వస్తాడని మేనేజ్మెంట్ భావిస్తోంది. దీనికి తోడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇటీవల టి20 వరల్డ్ కప్ లో తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు. టీమిండియా విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు. వారిద్దరు ఫామ్ లోకి రావడం పట్ల హైదరాబాద్ యాజమాన్యం ఖుషి ఖుషి గా ఉంది.
బలహీనతలు 
హైదరాబాద్ జట్టులో కమిన్స్ ఆడకపోతే.. ఆ ప్రభావం బౌలింగ్ మీద పడే అవకాశం ఉంది. గత సీజన్లో హైదరాబాద్ బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈసారి కమిన్స్ లేకపోతే.. ఆస్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద పారుతుంది. ప్లాట్ మైదానాల మీద సత్తా చూపించలేని బౌలర్లు బంతులు వేస్తే పరుగుల వరద ప్రవహించడం ఖాయం. అలాంటప్పుడు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయాల్సి ఉంటుంది.
చివరగా.. 
అని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. 2024 లో ఫైనల్ వెళ్లినప్పటికీ బ్యాటింగ్ లోపం వల్ల హైదరాబాద్ జట్టు ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చింది. గత ఏడాది బ్యాటింగ్.. బౌలింగ్ లోపం వల్ల తదుపరి దశకు వెళ్లకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ జట్టు వైఫల్యాలకు చరమగీతం పాడి.. సరికొత్తగా కనిపించాలని అభిమానులు భావిస్తున్నారు. జట్టు యాజమాన్యం కూడా ప్లేయర్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఈసారి హైదరాబాద్ జట్టు కప్ కొడుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ అంచనాలు నిజమవుతాయా.. విశ్లేషణలు కార్యరూపం దాల్చుతాయా.. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version