Homeబిజినెస్iQOO Z11X 5G price in India: మొబైల్ మార్కెట్లో iQOO సంచలనం.. తక్కువ ధరకే...

iQOO Z11X 5G price in India: మొబైల్ మార్కెట్లో iQOO సంచలనం.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్ ఫోన్.. వెంటనే తెలుసుకోండి..

iQOO Z11X 5G price in India: భారతదేశంలోని మొబైల్ మార్కెట్లో iQOO తన సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా 2026 సంవత్సరంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ను ఆకట్టుకునే విధంగా కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లు కలిగి ఉన్నా కూడా బడ్జెట్లోనే అందిస్తోంది. దీనికి ఉండే డిస్ప్లే కెమెరా, బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గా ఉండటంతో చాలామంది ఈ ఫోన్ కొనాలని అనుకుంటున్నారు. అయితే ఇందులో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల మార్కెట్లోకి IQOO Z11X5G మొబైల్ రావడంతో చాలామంది దీని గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మొబైల్స్ ఆకట్టుకునేలా విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఇందులో ప్రిస్మాటిక్ గ్రీన్ రంగు బాగా ఆకసిస్తోంది. ఇది పుదీనా ఆకు వలే కనిపిస్తోంది. వెనుక భాగంలో లైనింగ్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే 6.7 అంగుళాల LCD స్క్రీన్ ను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.1200 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ పై గొరిల్లా గ్లాస్ తో రక్షణగా ఉంటుంది. ఇందులో మీడియా టెక్ Dimensity 7400 టర్బో SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అలాగే 8 GB Ram ఉండగా..256 GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కారణంగా సాఫ్ట్వేర్, మెసేజింగ్, నావిగేషన్, స్ట్రీమింగ్ వంటివి వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
IQOO Z11X5G కెమెరా పనితీరు వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా సెటప్ ఉంది. 2 MP సెకండరీ కెమెరా కనిపిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 MP కెమెరా పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 7200 mAh బ్యాటరీ సామర్థ్యం ఉండగా ఈ బ్యాటరీ 44 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. దీంతో రోజువారి వినియోగదారులతోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ బ్యాటరీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి కూడా ఈ ఫోన్ బాగా పనిచేస్తుంది. అయితే ఇన్ని ఫీచర్లో ఉన్నప్పటికీ దీని ద్వారా మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగానే ఉంటుంది. 6 GB IQOO Z11X5G మొబైల్ ప్రెస్మాటిక్ గ్రీన్ కలర్ అయితే రూ.18,998 ధరతో విక్రయిస్తున్నారు. ఇదే వేరియంట్ టైటాన్ బ్లాక్ లో కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version