Bigg Boss Telugu 9 Agnipariksha Promo: ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ పై జనాల్లో అమితాసక్తిని రేపిన ఆసక్తికరమైన అంశం ‘అగ్ని పరీక్ష’. సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్స్ గా పంపే ప్రక్రియ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ షో పై జనాల్లో పెరిగిన ఆసక్తి మామూలుది కాదు. ఈ నెల 22 నుండి ఈ షో జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ షో కి జడ్జీలుగా గత సీజన్ కంటెస్టెంట్స్ అభిజీత్, బిందు మాధవి మరియు నవదీప్ వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జడ్జీలకు సంబంధించిన స్పెషల్ ప్రోమోలను విడుదల చేయగా, నిన్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో కంటెస్టెంట్స్ ని కూడా చూపించారు. ఈ ప్రోమో విశేషాలు ఒకసారి చూద్దాం.
Also Read: 1000 కోట్లు కొట్టడం కోసమే సినిమాలు చేస్తున్న తమిళ డైరెక్టర్స్…ఇంతకీ కొట్టారా..? లేదా..?
మనం ఊహించినంత కఠినంగా అయితే జడ్జీలు వ్యవహరించడం లేదు, ఫన్నీ గానే ఉన్నారు. కానీ సెలక్షన్ ప్రక్రియ లో మాత్రం చాలా అంటే చాలా కఠినంగా ఉన్నారని ఈ ప్రోమో ని చూస్తే తెలుస్తుంది. ముందుగా ఒక చిన్న గ్లింప్స్ లాగా అగ్ని పరీక్ష కి 42 మందిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో చూపించారు. ఆ తర్వాత ‘అగ్ని పరీక్ష’ షో లో ఆ కంటెస్టెంట్స్ చేసే టాస్కులను ప్రత్యేకంగా చూపించారు. బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టడం అంత తేలికైన విషయం కాదు, అందుకు జనాల ప్రేమ, మద్దతు కూడా లభించాలి అంటూ యాంకర్ శ్రీముఖి అంటుంది. ఆ తర్వాత బిందు మాధవి మాట్లాడుతూ ‘బిగ్ బాస్ షో లోపలకు అడుగుపెట్టకముందే వీళ్లకు ఒక ఓటు బ్యాంకు ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం’ అని అంటుంది బిందు మాధవి. ఆ తర్వాత గెస్ట్ గా వచ్చిన తేజ సజ్జా ‘అగ్ని పరీక్ష కి సిద్ధంగా ఉన్నారా’ అని అంటాడు.
ఇలా ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ షో ఉండబోతుంది అని ఈ ప్రోమో ని చూస్తేనే తెలుస్తుంది. బిందు మాధవి ఒక కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ‘రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి మనది’ అని అడగ్గా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నేను ఆడ నవదీప్ ని’ అని అంటుంది. మరో కంటెస్టెంట్ ని యాంకర్ శ్రీముఖి ‘నవదీప్ ఒక నా మీకు?’ అని అడగ్గా, ‘దేనికి అండీ’ అంటూ ఆ కంటెస్టెంట్ సమాధానం చెప్తుంది. ఇలా ఆద్యంతం ఫన్నీ గా వెళ్ళిపోతున్న ప్రోమో, సడన్ గా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ కి మొహమాటం లేకుండా రెడ్ కార్డు ఇచ్చి పంపేశారు. వాళ్ళు దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. ఇలా ఎన్నో ట్విస్టులతో ఉన్న ఈ షోకి సంబంధించిన ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
