Homeఆధ్యాత్మికంToday 17 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే.....

Today 17 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే.. ఇందులో మీ రాశి ఉందా?

Today 17 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో కంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటారు. కొత్తగా అప్పులు చేయకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తికి సంబంధించిన విషయం చర్చకు వస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గురువుల మద్దతు ఉండటంతో పై చదువుల కోసం సహాయం ఏర్పడుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలో పాల్గొనే వారికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడును పెడతారు. అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే ఇలాంటి వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు పంచుకోకుండా ఉండాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో ఉత్సాహంగా ఉంటారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. తెలియని చోట పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టిన ఈరోజు వెంటనే పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version