Surya Grahan 2022: మన దేశంలో గ్రహణాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అవి ఏర్పడినప్పుడు ఏ పని చేయరు. కనీసం తినడం కూడా ఉండదు. గ్రహణం పట్టినప్పుడు గర్భిణులు కదలకుండా పడుకోవాలని చెబుతారు. అంటే గ్రహణం దోశం అలా ఉంటుందని మన పూర్వీకుల విశ్వాసం. ఇప్పటికి కూడా అదే నమ్మకాన్ని విశ్వసిస్తున్నారు. ప్రతి గ్రహణం తరువాత కొన్ని రాశుల వారికి శుభప్రదమైన కాలం పడుతుందని కూడా చెబుతుంటారు. చైత్ర అమావాస్య రోజు గ్రహణం రావడంత జ్యోతిష్యం ప్రకారం రెండు రాశుల వారు కుబేరులవుతారని పండితులు చెబుతున్నారు.

గ్రహణాలు మనుషులపై కూడా ప్రభావం చూపుతాయి. గ్రహణ ప్రభావంతో కోటీశ్వరులు అయిన వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొందరికి గ్రహణాలు కూడా సహకరిస్తాయి. జాతక ప్రభావంతో వారి పంట పండినట్లే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వచ్చే గ్రహణం రెండు రాశుల వారికి శుభప్రదం కలిగించబోతోంది. వారి జాతకాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: KTR vs YCP: కేటీఆర్ తిట్ల వెనుక పెద్ద కథే? వైసీపీతో ఫ్రెండ్లీ ఫైట్ వెనుక ‘సెంటిమెంట్’ రాజకీయం?
ఇందులో మొదటి రాశి మిథున రాశి. వీరికి పట్టిందల్లా బంగారమే. లక్ష్మియోగం ఉంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారులకు మంచి కాలమే. లాభాలు చేతికందుతాయి. వ్యాారం సజావుగా సాగుతుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మీకు కలిగే అదృష్టంతో ఇతరులు కూడా అసూయపడతారు. ఏద చేయాలన్నా కుటుంబసభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

తరువాత రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కూడా అదృష్టమే. మంచి ఫలితాలు దక్కుతాయి. మానసికంగా సంతోషం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శివుడికి అభిషేకం చేస్తే మంచిది. గోవులకు గడ్డి వేస్తే మంచి శకునాలు ఉన్నాయి జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. దీంతో ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించి తమ అదృష్టాన్ని పెంచుకుంటారు.
Also Read:IPL 2022: ఐపీఎల్ లో అత్యధిక ఫోర్లు బాదింది వీరే..
Recommended Videos:



[…] […]