https://oktelugu.com/

Star Heroine: స్టార్ హీరోయిన్ అందాల వల.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Star Heroine Raashi Khanna: యంగ్ హీరోయిన్ రాశికన్నా టాలీవుడ్లో బబ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తన క్యూట్ లుక్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాశికన్నా వరుస ఆఫర్లతో స్టార్డమ్ సొంతం చేసుకుంది. రాశికన్నా తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు భారీ విజయాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2022 / 10:43 AM IST
    Follow us on

    Star Heroine Raashi Khanna: యంగ్ హీరోయిన్ రాశికన్నా టాలీవుడ్లో బబ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తన క్యూట్ లుక్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాశికన్నా వరుస ఆఫర్లతో స్టార్డమ్ సొంతం చేసుకుంది.

    రాశికన్నా తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. అయితే ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కొంత నిరాశ పరిచింది. అయినప్పటికీ ఆమె తెలుగులో ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

    నాగ చైతన్యతో సరసన ‘థ్యాంక్యూ’.. హీరో గోపీచంద్‌ కు జోడిగా ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’.. ‘అరన్మనై 3’.. ‘మేథావి’.. ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ మూవీలు చేస్తూనే బాలీవుడ్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది.

    Also Read: BJP Dr Parthasarathi: జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తాం: పార్థసారథి సంచలన ప్రకటన

    రాశి కన్నా సినిమాలు, ఈవెంట్స్ తో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా రాశీకన్నా తన భారీ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    కొద్దిరోజులుగా రాశికన్నా తన ఇన్ స్ట్రాలో పోస్టు చేస్తున్న పిక్స్ పరిశీలిస్తే ఆమె గ్లామర్ హద్దులను చెరిపేసినట్లే కన్పిస్తోంది. కెరీర్ మొదట్లో సంప్రదాయంగా కన్పించిన రాశికన్నా ఇప్పుడు మాత్రం అందాల ఆరబోతకే ప్రాధాన్యమిస్తోంది. నటనతోపాటు గ్లామర్ షోకు రాశికన్నా వెనుకడుగు వేయకపోవడంతోనే ఈ అమ్మడు ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బీజీ హీరోయిన్ మారిపోయింది.

    ఈక్రమంలోనే రాశికన్నా తన ఇన్ స్ట్రాలో బోల్డ్ పిక్స్ ను పోస్టు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో భారీ అందాల అరబోతతో కూడిన రాశికన్నా పిక్స్ చూపరులను కట్టిపడేస్తున్నాయి.

    Also Read: KTR Comments On AP: ఆంధ్రాపై వ్యాఖ్యలు.. దిగివచ్చిన కేటీఆర్.. జగన్ సోదరుడట..

    Recommended Videos: