Homeఆంధ్రప్రదేశ్‌KTR vs YCP: కేటీఆర్ తిట్ల వెనుక పెద్ద కథే?  వైసీపీతో ఫ్రెండ్లీ ఫైట్ వెనుక...

KTR vs YCP: కేటీఆర్ తిట్ల వెనుక పెద్ద కథే?  వైసీపీతో ఫ్రెండ్లీ ఫైట్ వెనుక ‘సెంటిమెంట్’ రాజకీయం?

KTR vs YCP: పాలునీళ్లలా కలిసిపోయారు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్-జగన్ లు. నాడు 2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించడానికి హైదరాబాద్ లోని ఏపీ వ్యాపారులను నయానో భయానో బెదిరించి జగన్ కు సపోర్టు చేయించారని కేసీఆర్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబుకు ఆర్థిక సాయం అందకుండా.. జగన్ కు చేసేలా ఒత్తిడి తెచ్చారని జోరుగా ప్రచారం సాగింది. కట్ చేస్తే.. కేసీఆర్ అనుకున్నట్టే.. ఏపీలో జగన్ కొలువుదీరారు. గెలవగానే ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ ను ఆలింగనం చేసుకున్నారు. కృతజ్ఞత చూపారు.

KTR vs YCP
Jagan, KTR, KCR

అప్పటినుంచి అన్నాదమ్ముళ్లలాగానే కేసీఆర్, జగన్ లు ముందుకెళుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య అప్పుడప్పుడు గిల్లికజ్జాలు జరుగుతున్నా వాటి వెనుక కేసీఆర్, జగన్ ల స్వరాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు అంటూ పక్కరాష్ట్రంపై ఫైరింగ్ చేసి అక్కడి ప్రజల ఆమోదం పొందేందుకు ఇలా కేసీఆర్, జగన్ లు ఫ్రెండ్లీ ఫైట్ చేసుకున్నారన్న ఇన్ సైడ్ టాక్ ఉంది.

ఇక తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో దీనస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సామాన్య జనంలోకి కూడా ఇవి వెళ్లాయి. నిజానికి గత కొంతకాలంగా ఏపీలో ఉన్న పరిస్థితులనే కేటీఆర్ చెప్పారు. అందులో కొత్త విషయాలేవీ లేవు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మంత్రులే చెప్పారు. కరెంట్ కోతలకు సాక్ష్యంగా పవర్ హాలీడేలను ఏపీ విద్యుత్ సంస్థలే ప్రకటించాయి. ఇవన్నీ నిజాలే.. వాటినే కేటీఆర్ ప్రస్తావించారు. అందులో తప్పేం లేవు. ఇప్పటికే పవన్ , బీజేపీ, చంద్రబాబు కూడా ఇవే ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడే కేటీఆర్ దీన్ని ఎందుకు లేవనెత్తాడు? దీని వెనుక ప్లాన్ ఏంటన్నది చర్చనీయాంశమైంది.

ఇటీవల జగన్ నిర్ణయాలను కేటీఆర్ ప్రశంసించారు. మూడు రాజధానులను గ్రేట్ అన్నారు. కానీ తాజాగా జగన్ సర్కార్ పరువు తీసేలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కడం లేదు. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న చర్చ కూడా ప్రారంభమైంది.

బీజేపీతో ఫైట్ కు రెడీ అయిన కేసీఆర్, కేటీఆర్ లు.. అశేష ఎంపీల బలం ఉన్న జగన్ మద్దతు అవసరం. కానీ జగన్ కు ఉన్న కేసులు.. ఏపీ అవసరాల దృష్ట్యా ఆయన బీజేపీతో ఫైట్ చేయలేని పరిస్థితి. జగన్ కలిసిరాకపోవడంతో ఆ అసంతృప్తి టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే కేటీఆర్ బరెస్ట్ కావడానికి కారణమంటున్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చినా అది గట్టిగా ఇవ్వలేదు. మంత్రి రోజా అయితే కేసీఆర్ ను కలిశాక ‘ఖండిస్తున్నా’ అని మాత్రమే అన్నది. ఇక జగన్ వాయిస్ అయిన సజ్జల ‘కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలుచుకోలేదని’ వదిలేశాడు. మిగిలిన వారిదీ అదే దారి.

Also Read: Janasena: ఇన్నాళ్లు తిడితే పడే జనసేన.. ఇప్పుడు మీదపడిపోతోందేంటి?

హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులున్న వైసీపీ నేతలకు టీఆర్ఎస్ తో గొడవ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే కేటీఆర్ తిట్టినా ఆయనపై ఒత్తిడి తెచ్చి ఒక సానుభూతి ట్వీట్ చేయించారన్న టాక్ ఉంది. అంతేకానీ.. కేటీఆర్ పై టీడీపీ మీద పడ్డట్టు విరుచుకుపడలేదు. కేటీఆర్ అన్ని మాటలన్నీ మంత్రి రోజా నేరుగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎంత తిట్టినా వైసీపీ నేతలు మాత్రం గులాబీ పార్టీని పల్లెత్తు మాట అనడానికి సాహసించడం లేదు.

అయితే దీని వెనుక సరికొత్త రాజకీయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ మామూలుగా తమకు స్నేహితుడైన జగన్ సర్కార్ పై ఈ మాటలు అనడాన్ని అందరూ అనుమానంగానే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూసుకు వస్తుండడంతో మరోసారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ‘ఆంధ్రా’ణే బూచీగా చూపి రెచ్చగొట్టే వ్యూహాత్మక పాలిటిక్స్ అమలు చేస్తున్నారా? అన్న వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ పడిపోయింది. ఇక అధికార టీఆర్ఎస్ పై బోలెడంత వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులే. పోయిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును బూచీగా చూపి గెలిచిన కేసీఆర్ కు.. టీఆర్ఎస్ కు ఈసారి దేన్నీ చూపించాలో తెలియడం లేదు. అందుకే టీఆర్ఎస్ మరోసారి ‘ఆంధ్రా’ యాంటీ సెంటిమెంట్ నే నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని పెంచడానికే టీఆర్ఎస్, వైసీపీ ఫ్రెండ్లీ ఫైట్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read: Telugu TV Anchors Remuneration: వామ్మో.. బుల్లితెర వ్యాఖ్యాతల పారితోషికం అంతా?

Recommended Videos
మీకు దండం పెడతా | Guntur Public Talk || Common Man Comments on 3 Years of Jagan Ruling || Ok Telugu
Minister KTR Sensational Comments on AP Roads || Telangana vs AP || Ok Telugu
TDP Leader Divyavani Strong Warning to Minister Roja || TDP vs YCP || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

4 COMMENTS

  1. […] Viral News: వివాహమనేది జీవితంలో మధురానుభూతి. అందుకే దాని అనుభూతుల్ని జీవితాంతం నెమరువేసుకుంటారు. అబ్బో మా పెళ్లి అలా జరిగింది ఇలా జరిగింది అంటూ గొప్పలు చెబుతుంటారు. మనదేశంలో వివాహ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ పెళ్లిని జరుపుకుని ఆనందపడుతుంటారు. కానీ ఇక్కడో గమ్మత్తైన విషయం చోటుచేసుకుంది. వివాహ సమయానికి ఆలస్యంగా రావడంతో ఏకంగా పెళ్లి కుమారుడినే మార్చేశారు. […]

  2. […] Ganji Prasad Murder Case: ఏలూరు జిల్లాలో జరిగిన వైసీపీ నేత హత్య కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు పోలసుల ఎదుట లొంగిపోయారు. ఓ వైపు హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై ఘటన జరిగిన కొంతసేపటికే ఈ వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత హత్యకు గ్రూపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో ముగ్గురు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. […]

Comments are closed.

Exit mobile version