Ravana is not only cremated: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో అమ్మవారిని రోజుకొక నైవేద్యం పెట్టి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కో అవతారంలో కనిపిస్తుంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత పదవ రోజు అనగా దశమి రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అందరూ కొత్త దుస్తులు ధరించి ఎంతో వేడుకగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. రాముడికి, రావణాసురుడికి యుద్ధం జరగ్గా.. అందులో రాముడు విజయం సాధించాడని విజయదశమి జరుపుకుంటారు. అలాగే చాలా చోట్ల రావణాసురుడిని దహనం చేస్తారు. కానీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో అసలు రావణాసురుడిని దహనం చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి ఏయే ప్రాంతాల్లో రావణాసురుడిని దహనం చేయకుండా పూజిస్తారో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్
సాధారణంగా దసరా రోజు రావణాసురుడిని దహనం చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో రావణాసురుడిని దహనం చేయకుండా పూజిస్తారు. రావణాసురుడి సతీమణి మండోదరి ఇక్కడ జన్మించడం వల్ల ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రావణాసురుడిని అల్లుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న 35 అడుగుల రావణుడి విగ్రహం ఉంది.
ఉత్తరాఖండ్
రావణాసురుడు శివ భక్తుడు. శివుని మీద ఉన్న భక్తితో రావణాసురుడిని బైజ్‌నాథ్‌లో ఉండే దహనం చేయరు. ఇలా చేయడం వల్ల శివుడు ఆగ్రహానికి గురవుతారట. అందుకే నవరాత్రులలో ఇక్కడ రావణాసురుడిని ప్రత్యేకంగా పూజిస్తారట. రావణాసురుడిని దహనం చేయడం వల్ల పాపం తగులుతుందని.. భావిస్తారు. అందుకే ఎంతో భక్తితో రావణాసురుడిని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల వారికి శివుడి ఆశీస్సులు అందుతాయని ప్రజలు నమ్ముతారు.
ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని బిస్రత్‌లో ఎంతో భక్తి శ్రద్ధలతో రావణాసురుడిని పూజిస్తారు. ఎందుకంటే రావణాసురుడు ఇక్కడ జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఈ గ్రామంలో రావణాసురుడిని దహనం చేయకుండా పూజిస్తారు. అలాగే కాన్పూర్‌లోని కూడా రావణుడిని దహనం చేయరు. ఇక్కడ ఉండే శివాలయాన్ని రావణుడికి అంకితం చేయడం వల్ల దహనం చేయరు. రావణుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే రావణాసురుడిని దహనం చేయకుండా పూజిస్తారు.
రాజస్థాన్
రావణాసురుడు తన భార్య మండోదరిని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వివాహం చేసుకున్నాడట. దీనివల్ల ఈ ప్రాంతంలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయరట. ఇక్కడ ప్రజలు దేవుడిగా కొలిచి పూజిస్తారు. రావణాసురుడిని తమ ఇంటి సభ్యుని భావిస్తారు. అందుకే తనకి ఎలాంటి హాని జరగకూడదని భావించి భక్తితో పూజిస్తారట. మరి మీ ప్రాంతంలో రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారా? లేదా? అనే విషయాన్ని కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా మాత్రమే ఈ విషయాలు తెలియజేయడం జరిగింది.