MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ ఆ జంట ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వివాదాలు కు దారితీస్తున్నాయి. రెండు రోజుల కిందట తిరుమలలో ప్రత్యక్షమైన ఆ జంట రాష్ట్ర ప్రజలకు కనువిందు చేసింది.త్వరలో వివాహ బంధంతో తాము ఒకటి కానున్నట్లు చెప్పుకొచ్చింది ఆ జంట.అప్పటినుంచి మీడియా ఛానళ్లు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి.ప్రత్యేక ఇంటర్వ్యూ చేయిస్తున్నాయి.ఈ క్రమంలో వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.అడ్డంగా బుక్ అవుతున్నారు.ఇప్పటికే తిరుమలలో మాధురి ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేశా రన్నది ప్రధాన ఆరోపణ.ఆమెకు రీల్స్ చేసే అలవాటు ఉంది.తిరుమలలో ఫోటోలు తీయడం,వీడియోలు రికార్డింగ్ చేయడం నిషేధం. ఈ నిషేధాజ్ఞలు అధిగమించి మాధురి ఫోటో షూట్ చేశారు.దీంతో విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివిధ సెక్షన్ల కింద పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.అయితే ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న మాధురి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారానికి కారణమవుతున్నాయి.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో జనసైనికులు ఫైర్ అవుతున్నారు.
* పవన్ రాజీనామాకు డిమాండ్
అయితే ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన మాధురి జనసైనికులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.తమ విషయంలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నది వారేనని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దువ్వాడ శ్రీనివాసును రాజీనామా చేయాలని కోరుతున్నారని.. ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.పవన్ ముగ్గురు భార్యల విషయాన్ని కూడా ప్రస్తావించారు.అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇంతలో దువ్వాడ శ్రీనివాస్ కలుగ చేసుకున్నారు.తాను చేసినది తప్పు అయితే.. పవన్ చేసినది కూడా తప్పేనని తేల్చి చెబుతున్నారు.
* అనుచిత వ్యాఖ్యలు
అయితే అంతటితో ఆగని మాధురి డిప్యూటీ సీఎం గా ఒక పనికిరాని వ్యక్తిని పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె నేరుగా ఆరోపణలు చేయకున్నా.. దువ్వాడ శ్రీనివాసుని ఉదహరిస్తూ ఆ కామెంట్స్ చేశారు. దీనిపై జనసైనికులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ నేత మీ మాదిరిగా వ్యవహరించలేదని గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. మీ బంధంలో వచ్చిన సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని.. ఇందులో పవన్ కళ్యాణ్ ను లాగితే బాగుండదని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.