Numerology Effect: మనం కొన్ని పనులు చేయాలని అనుకున్నప్పుడు ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అందుకు కారణం అదృష్టం బాగాలేదని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి జీవితంలో న్యూమరాలజీ కూడా పనిచేస్తుంది అని గ్రహించాలి. కొన్ని రకాల నెంబర్లు మన జీవితంలో ఉంటే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదు. కానీ కొన్ని నెంబర్లు మాత్రం అనుకూలంగా ఉండి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం తమ పేరును బట్టి ఏ నెంబర్లు తమకు అనుకూలంగా ఉంటాయో న్యూమరాలజిస్ట్ చెబుతూ ఉంటారు. వారు తెలుపుతున్న ప్రకారం కొన్ని ఫోన్ నెంబర్లు కూడా వారి జీవితాల్లో మార్పులు తెస్తాయని అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ నెంబర్ లో ఈ నెంబర్లు ఉంటే.. ఎదుటివారి మొబైల్ నెంబర్ కు భిన్నంగా ఉంటే.. ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు వస్తూ ఉంటాయి. మరి ఆ నెంబర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Read Also: అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాను తేజ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..?
మొబైల్లో సిమ్ కార్డు తీసుకునే సమయంలో కొందరు ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటారు. మరికొందరు కొంచెం గుర్తుండే నెంబర్లు కొనుగోలు చేస్తారు. అయితే తమ మొబైల్ నెంబర్ ఈ విధంగా ఉంటే తమ జీవితంలో అనేక మార్పులు వస్తాయని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. ఎవరి మొబైల్లో నైనా 1 నెంబర్ ఉంటే.. వారు ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటారు. ఈ నెంబర్ ను సూర్యుడు అంటారు. ఈ నెంబర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఎదుటివారిని తమ ఆధీనంలోకి తీసుకొస్తారు. అంతేకాకుండా వివాహితులు అయితే తమ భార్యపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.
రెండో నెంబర్ విషయానికి వస్తే.. ఎవరి మొబైల్లో నైనా రెండో నెంబర్ ఉన్నట్లయితే వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఈ నెంబర్ను చంద్రుడు అంటారు. ఈ నెంబరు ఉన్నవాళ్లు చిన్న విషయానికే రియాక్ట్ అవుతారు. ఎదుటివారి ఒత్తిడికి తలకి ఉంటారు. ముఖ్యంగా వీరు ఆడవారు అయి ఉండి.. మగవారి ఫోన్ నెంబర్ లో ఒకటో నెంబర్ ఉంటే వారి చేత బాధింపబడతారు. న్యూమరాలజీ ప్రకారం 6 నెంబర్ ను శుకుడు అంటారు. ఈ నెంబర్ లేదా మొబైల్లో 24, 33,42,52,60 నెంబర్ ఉన్నవారు చాలా శక్తివంతంగా ఉంటారు. వారు అనుకున్న పనిని సాధించగలుగుతారు. ఒకవేళ భర్త మొబైల్ నెంబర్ ఒకటి ఉండి భార్య మొబైల్ నెంబర్ ఈ శుక్రుడు నెంబర్లు అయితే ఇద్దరి మధ్య పోటాపోటీ ఉంటుంది.
Read Also: మళ్లీ వాయిదానా? ‘రాజా సాబ్’ పరిస్థితేంటి? ఎప్పుడొస్తుంది?
ఇక చివరి నెంబర్ 8. ఈ నెంబర్ శనికి ప్రతిరూపం. ఈ నెంబర్ గల మొబైల్ నెంబర్ ఉంటే వారు మిగతా వారి కంటే భిన్నంగా ఉంటారు. తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తారు. ఎదుటివారు చెప్పింది వినరు. అయితే వీరితో ఒకటో నెంబర్ సూర్యుడు కలవారు భర్తగా ఉంటే వీరి మధ్య కూడా పోటాపోటీ ఉంటుంది. ఒకరి మాట మరొకరు వినకుండా ఉంటారు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి.