Raja Saab Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ ని ఆడియన్స్ యాక్షన్ మూవీస్ లో చూడడానికి ఎంత ఇష్టపడతారో, ఎంటర్టైన్మెంట్ జానర్ లో చూడడానికి కూడా అంతే ఇష్టపడుతారు. ఆయన కామెడీ టైమింగ్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాక భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు దూరమయ్యాడు. ‘రాజా సాబ్’ చిత్రం మరోసారి ప్రభాస్ నుండి ఎంటర్టైన్మెంట్ ని బయటకి రాబట్టే సినిమా అని టీజర్ ని చూసినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. అయితే ఈ సినిమాని డిసెంబర్ 5 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ టీజర్ ద్వారానే తెలిపారు. కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం లేదని, సంక్రాంతి కానుకగా జనవరి 9 న రాబోతుందని ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.
Also Read: నీ సినిమాలు ఆడవు..విలన్ గా చేయి.. ముఖం మీదే చెప్పిన బడా నిర్మాత
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ ఏడాది ‘హరి హర వీరమల్లు’ తో మన ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఈ సినిమా ఫలితాన్ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ నిధి అగర్వాల్ అంటే భయపడుతున్నారు. ఈమెది ఐరన్ లెగ్ అని, చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ‘రాజా సాబ్’ అలా అయ్యే అవకాశమే లేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read: అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాను తేజ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..?
ఆయన మాట్లాడుతూ ‘రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అత్యధిక శాతం మంది జనాలు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు, ట్రేడ్ కూడా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 రావాలని కోరుకుంటున్నారు. కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం డిసెంబర్ 5 న రమ్మని అంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబర్ లో వాళ్లకి గొప్ప సినిమాలు విడుదల లేవు. క్రిస్మస్ కూడా ఖాళీగా ఉంది. అక్టోబర్ చివరకు సినిమా ఫస్ట్ కాపీ మొత్తం రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మరియు సాంగ్స్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ప్రస్తుతానికి మేము అయితే డిసెంబర్ 5 నే అనుకుంటున్నాము’ అని చెప్పుకొచ్చాడు నిర్మాత విశ్వ ప్రసాద్. దీంతో ఈ సినిమా జనవరి 9 న విడుదల అవ్వబోతుంది అనే వార్తకు తాత్కాలిక బ్రేక్ పడినట్టే అనుకోవచ్చు.
#RajaSaab will be ready by October, and we’re aiming for a release on December 5th or 6th.
The raw footage is around 4 hours and 30 minutes, which is quite common for a big film.
– Producer #TGVishwaPrasad#Prabhas pic.twitter.com/wqitVL1YEc
— Suresh PRO (@SureshPRO_) August 6, 2025