Teja Rejected Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య భారీ పోటీ అయితే ఉంటుంది. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనే విషయాల మీద చాలా తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరోలు మరొకరు లేరు అనేంతల గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే మొదటి సినిమా అయిన గంగోత్రి సినిమాకి స్టోరీ రైటర్ గా పని చేసిన చిన్నికృష్ణ రీసెంట్ గా ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలనైతే తెలియజేశాడు. మొదట అల్లు అర్జున్ తేజ డైరెక్షన్లో జయం అనే సినిమా చేయాల్సిందట. అల్లు అరవింద్ దీనికి సంబంధించిన ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసి స్వయంగా తనే ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఏమైందో తెలియదు కొద్ది రోజుల తర్వాత తేజ ఈ సినిమాని నితిన్ తో చేస్తున్నట్టుగా పేపర్ ప్రకటన ఇవ్వడంతో చిన్న కృష్ణ ఒకసారిగా షాక్ అయ్యాడట…ఏం జరిగింది అని అల్లు అరవింద్ ని అడిగితే కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆ సినిమా చేయలేకపోతున్నామని చెప్పాడట…
Also Read: మహావతార్ నరసింహ.. చెప్పులు విడిచి థియేటర్లోకి.. ఏ సినిమాకు ఇలా కాలేదు…
ఇక మొత్తానికైతే చిన్ని కృష్ణ 365 రోజుల్లో మీ కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేద్దామని అల్లు అరవింద్ కి మాటిచ్చాడట. అందుకే గంగోత్రి సినిమా కథని రాసి రాఘవేంద్రరావుతో గంగోత్రి సినిమా చేయించి మొత్తానికైతే ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపారట.
ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఆ టైంలో కొంతవరకు డిప్రెషన్ లో ఉన్నప్పటికి గంగోత్రి సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక సక్సెస్ ని ఏర్పాటు చేసుకున్నాడని అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు అంటూ అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ వెర్షన్ లో సరికొత్త సన్నివేశాలు!
మరి తేజ అల్లు అర్జున్ ని పక్కన పెట్టి నితిన్ తో జయం సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే కథ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయమని అల్లు అరవింద్ చెప్పాడట అందుకే తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వేరే హీరోని పెట్టి ఆ సినిమాని చేసినట్టుగా గతంలో ఒకసారి క్లారిటీ ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…