Homeఆధ్యాత్మికంToday 12 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. ఖర్చులు విపరీతంగా...

Today 12 March 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం..

Today 12 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి బంధువుల రాకతో తొందరగా మారుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లలకి కెరీర్ పై కీలకఎలుక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల అండదండలతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పిల్లల పోటీపరీక్షల వైపు నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆధునిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పూర్వీకుల ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉండడంతో ప్రాజెక్టులను సమయానికి అనుకూలంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అదనపు ఆదాయం పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి పై శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. కొన్ని కారణాలవల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఇవి లాభాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సమయం అనుకూలంగా ఉండడంతో ఉద్యోగులు ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆర్థిక విషయాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా పనులు పూర్తి కావడంతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular