Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈరోజు వీరు ప్రయాణాలు చేయడం అంతమంచిది కాదు.. నేడు రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: ఈరోజు వీరు ప్రయాణాలు చేయడం అంతమంచిది కాదు.. నేడు రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

కుటుంబంలో సమస్యలు తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. సాయంత్రం తండ్రితో కలిసి సమస్యలపై చర్చిస్తారు.

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 15న బుధవారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులు కలిగిన వ్యాపారులకు శుభ ఫలితాలు కలగనున్నాయి.

షరాశి:
కుటుంబంలో సమస్యలు తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. సాయంత్రం తండ్రితో కలిసి సమస్యలపై చర్చిస్తారు.

వృషభం:
ఖర్చులను కంట్రోల్ చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భాగస్వామితో కుటుంబ విషయాలు చర్చిస్తారు. దీంతో ఒత్తిడి తగ్గిపోయే అవకాశం.

మిథునం:
సామాజిక సేవపై ఎక్కువగా దృష్టి పెడుతారు. నిరుద్యోగులకు అనుకూల సమయం. కొత్త ఉద్యోగాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

కర్కాటకం:
ఓ సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి.

సింహం:
పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. లేకుంటే బంధుత్వం చెడిపోయే ప్రమాదం ఉంది.

కన్య:
ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరిగినా నైపుణ్యంతో ఆర్థిక ప్రణాళిక వేస్తారు. సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతారు.

తుల:
భాగస్వామితో కాస్త ఆందోళనగా ఉంటారు. వ్యాపారులు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు డబ్బు సర్దుబాటు చేస్తారు.

వృశ్చికం:
ఆస్తుల వివాదాల్లో చిక్కుకోవచ్చు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించినా అవి వాయిదా పడొచ్చు. సాయంత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు:
విహార యాత్రలకు వెళ్లొద్దు. ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు.

మకరం:
ఇంతకాలం కోరుకున్న వస్తువులను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు ప్లాన్ వేస్తారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

కుంభం:
వివాహం చేసుకోవాలనుకునేవారికి సంబంధాలు వస్తాయి. ఇతరుల నుంచి బహుమతిని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మీనం:
మాట ప్రవర్తనపై సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ అందుతాయి. కొన్ని విషయాల్లో ఇతరులకు సాయం చేస్తారు. అయితే వారు మీ నుంచి ఏదైనా ఆశించవచ్చు.

Recommended Video:

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper